తెలంగాణ

telangana

ETV Bharat / city

'ఓట్ల కోసమే డబుల్ బెడ్రూం వెరిఫికేషన్...'

ఎన్నికల ముందు మరోసారి హడావుడి చేసేందుకు గ్రేటర్ పరిధిలో మళ్లీ డబుల్ బెడ్​రూమ్ ఇళ్ల లబ్ధిదారుల వెరిఫికేషన్​ను ప్రభుత్వం చేపట్టిందని భాజపా కార్పొరేటర్ కొప్పుల నర్సింహా రెడ్డి ఆరోపించారు. కొత్తగా ఇళ్లు నిర్మించకపోయినా.. దరఖాస్తు చేస్తున్న వారి వివరాలు, ఓటర్ ఐడీ నెంబర్లు ఎందుకు సేకరిస్తున్నారని ఆయన ప్రశ్నించారు. దీనిపై ఈసీకి ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు.

DOUBLE BEDROOM
DOUBLE BEDROOM

By

Published : Aug 7, 2022, 5:17 PM IST

ప్రజల నుండి పూర్తి వ్యతిరేకత వస్తున్న నేపథ్యంలో ఓట్ల కోసం తమ ఉనికి కాపాడుకునేందుకు తెరాస మరోసారి డబుల్ బెడ్రూం పథకం తెరపైకి తెచ్చిందని మన్సూరాబాద్ డివిజన్ కార్పొరేటర్ కొప్పుల నర్సింహా రెడ్డి అన్నారు. డివిజన్ పరిధిలోని వీకర్ సెక్షన్ కాలనీ కమ్యూనిటీ హాల్, ఎస్.కె.గార్డెన్ వద్ద లబ్ధిదారుల వివరాలు పరిశీలన చేస్తున్న కేంద్రాలను ఆయన సందర్శించారు. ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకున్న డబుల్ బెడ్రూం ఆశావహులను జీహెచ్ఎంసీ సిబ్బంది ద్వారా ఓటర్ ఐడీ కోసం పేద ప్రజలను మభ్యపెడుతున్నారని మండిపడ్డారు.

ఎన్నికల స్టంట్: 4, 5 సంవత్సరాల క్రితం డబుల్ బెడ్ రూమ్​ల కోసం మీ సేవా కేంద్రాల్లో దరఖాస్తు చేసుకున్న నిరుపేద ప్రజల అన్ని వివరాలు దరఖాస్తులో ఉన్నా.. మళ్లీ కేవలం ఓటర్ ఐడీ నెంబర్లు రాసుకుంటున్నారని మరోసారి రానున్న ఎన్నికల స్టంట్స్ కోసమే కేసీఆర్ ప్రభుత్వం ప్రజలను మోసం చేయడానికే డబుల్ బెడ్రూంల ఆశ చూపుతున్నారని నర్సింహా రెడ్డి ఆరోపించారు. ఎల్బీనగర్ నియోజకవర్గంలో 70వేల దరఖాస్తులకు గాను 1100 డబుల్ బెడ్రూంలు నిర్మాణం చేశారని అందులో ఇప్పటికే ఇవ్వడం జరిగిందని ఇంతమంది ఆశావహులను ప్రభుత్వం మోసం చేస్తుందని ఆరోపించారు.

ఈసీకి ఫిర్యాదు చేస్తా:ప్రజలు ఎన్నో సమస్యలతో అల్లాడుతుంటే ఎవ్వరినీ ప్రలోభ పెట్టడానికి కేసీఆర్ ప్రభుత్వం అధికార యంత్రాంగాన్ని స్వార్ధ పనుల కోసం ఇలా వాడుకుంటున్నారని అన్నారు. ఎవరి అనుమతి తీసుకొని ప్రజల వద్ద ఓటర్ ఐడీ నెంబర్లు తీసుకుంటున్నారని అన్నారు. దీనిపై ఎన్నికల కమిషనర్​కు ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు.

ABOUT THE AUTHOR

...view details