ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు జిల్లా మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర స్వామికి 14 కిలోల బంగారు అభిషేకం గిన్నెలను పీఠాధిపతి సుబుదేంద్ర తీర్థులు సమర్పించారు. రూ.కోటి విలువైన చామర్లు అందజేశారు. మరోవైపు 350వ ఆరాధనోత్సవాల సందర్భంగా.. మూడో రోజు పూర్వారాధన వేడుకలు ఘనంగా నిర్వహించారు.
MANTRALAYAM: రాఘవేంద్రునికి 14 కేజీల బంగారు అభిషేకం గిన్నెలు కానుక
మంత్రాలయంలో 350వ ఆరాధనోత్సవాలు మూడో రోజు వైభవోపేతంగా జరుగుతున్నాయి. రాఘవేంద్ర స్వామికి 14 కేజీల బంగారు అభిషేకం గిన్నెలు, రూ. కోటి విలువైన చామర్లను పీఠాధిపతి కానుకగా సమర్పించారు.
మంత్రాలయం
ఇందులో భాగంగా తితిదే తరఫున.. ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, అదనపు ఈవో ధర్మారెడ్డి స్వామి వారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. రాఘవేంద్రుని మూల బృందావనానికి ప్రత్యేక పూజలు చేశారు.
ఇదీ చదవండి:TS Schools reopen : బడికి పంపడం తల్లిదండ్రుల ఇష్టమే!