తెలంగాణ

telangana

ETV Bharat / city

Vaccine : వ్యాక్సిన్​ను భుజం కండరానికే ఎందుకు వేస్తారో తెలుసా? - why the vaccine is given to the shoulder muscle?

కొవిడ్‌ వ్యాక్సిన్‌ను భుజం దగ్గర వేస్తున్నారనేది తెలిసిందే. పోలియో తప్పితే దాదాపుగా అన్ని రకాల వ్యాక్సిన్లనూ భుజం కండరానికే వేస్తారు కానీ ఇతర ఇంజెక్షన్ల మాదిరిగా రక్తనాళానికి ఎక్కించరు. ఎందుకంటే..?

covid vaccine, covid vaccine given to shoulder, corona vaccine
కరోనా వ్యాక్సిన్, కొవిడ్ టీకా, భుజానికే కరోనా టీకా

By

Published : Jun 6, 2021, 7:32 AM IST

టీకాలు దాదాపుగా భుజం దగ్గరే వేస్తున్నారు. ఎందుకంటే.. భుజం పై భాగంలో ఉండే డెల్టాయిడ్‌ కండరాల్లో రోగనిరోధకశక్తి కారక డెండ్రిటిక్‌ కణాలు ఉంటాయి. ఇవి వ్యాక్సిన్‌లోని యాంటిజెన్లను వెంటనే గుర్తించి, శరీర రోగనిరోధక వ్యవస్థ కేంద్రస్థానమైన లింఫ్‌నోడ్స్‌కు చేరవేస్తాయి. అక్కడున్న టి, బి కణాలు అంతే త్వరగా స్పందించి, యాంటీబాడీల ఉత్పత్తిని ప్రారంభిస్తాయి.

అదే నేరుగా రక్తంలోకి వెళ్లేలా ఇంజెక్ట్‌ చేస్తే ఇతర కణాలతో కలగలిసిపోవడంతో వ్యాక్సిన్‌లోని యాంటిజెన్లను రోగనిరోధక వ్యవస్థ త్వరగా గుర్తించలేదు. పైగా కండరానికి ఇవ్వడం వల్ల వాచినా నొప్పి వచ్చినా అది అక్కడికే పరిమితమవుతుంది. అంటే దుష్ఫలితాల శాతమూ తక్కువే అని వివరిస్తున్నారు నిపుణులు.

ABOUT THE AUTHOR

...view details