దిశ నిందితుల మృతదేహాలకు పంచనామా నిర్వహించిన తహసీల్దార్లను సిర్పూర్కర్ కమిషన్ విచారించింది. ఫరూఖ్ నగర్, కొందుర్గు, కొత్తూర్ తహసీల్దార్లతో పాటు... ఫరూఖ్ నగర్ వీఆర్ఏను కమిషన్ ప్రశ్నించింది. ఎన్కౌంటర్ జరిగిన ఘటనా స్థలానికి వెళ్లినప్పుడు... పంచనామా నిర్వహించే సమయంలో ఎలాంటి నిబంధనలు పాటించారనే విషయాన్ని తహసీల్దార్లను కమిషన్ ప్రశ్నించింది. అఫిడవిట్లో పేర్కొన్న అంశాలన్నీ సొంతంగానే పొందుపర్చారా లేకపోతే ఎవరి సలహాలు, సూచనలు తీసుకున్నారా అనే అంశాలను కమిషన్ అడిగి తెలుసుకుంది.
Disha case : తహసీల్దార్లను ప్రశ్నించిన సిర్పూర్కర్ కమిషన్
దిశ నిందితుల ఎన్కౌంటర్ కేసులో సిర్పూర్కర్ కమిషన్(Sirpurkar Commission) విచారణ ముమ్మరం చేసింది. ఇప్పటికే మూడు విడతలుగా కమిషన్ సభ్యులు 14 మందిని విచారించింది. దిశ నిందితుల మృతదేహాలకు పంచనామా నిర్వహించిన తహసీల్దార్లను సిర్పూర్కర్ కమిషన్ ఇవాళ ప్రశ్నించింది.
పంచనామా నిర్వహించే సమయంలో జాతీయ మానవ హక్కుల కమిషన్ నిర్దేశకాలను పాటించారా అనే విషయాలను కమిషన్ సభ్యులు ప్రస్తావించారు. కమిషన్ విచారణ ఈ నెల 25వ తేదీ వరకు కొనసాగనుంది. సిట్‌కు నేతృత్వం వహించిన హైదరాబాద్ సీపీ మహేశ్ భగవత్‌ను కమిషన్ విచారించనుంది. ఇప్పటికే కమిషన్ సభ్యులు 14 మందిని విచారించారు. హోంశాఖ కార్యదర్శి రవిగుప్త, సిట్ దర్యాప్తు అధికారి సురేందర్ రెడ్డి, దిశ సోదరితో పాటు మృతుల కుటుంబ సభ్యుల నుంచి కమిషన్ వాంగ్మూలం సేకరించింది.
ఇదీ చదవండి :Sirpurkar Commission : దిశ నిందితుల ఎన్కౌంటర్ కేసులో కొనసాగుతున్న విచారణ