దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌పై విచారణ నిర్వహించేందుకు ఏర్పాటైన సిర్పూర్కర్ కమిషన్ కార్యాచరణ వేగవంతం చేసింది. ఈ నెల 21, 26, 27, 28 తేదీల్లో విచారణ నిర్వహించిన కమిషన్... ఎన్‌కౌంటర్‌కు సంబంధించి పలు వివరాలు సేకరించింది. ప్రభుత్వం తరఫున సాక్షులుగా విచారణకు హాజరైన హోంశాఖ కార్యదర్శి రవిగుప్తను ఈ నెల 21న విచారణ నిర్వహించింది. ఎన్‌కౌంటర్‌కు దారితీసిన పరిస్థితులు, నిందితులపై కాల్పులు జరిపే సమయంలో ఎలాంటి చర్యలు తీసుకున్నారనే విషయాలను రవిగుప్త నుంచి కమిషన్ సేకరించింది.
మూడు రోజులు సురేందర్‌రెడ్డినే...
21వ తేదీ మధ్యాహ్నం తర్వాత సిట్ దర్యాప్తు అధికారిగా వ్యవహరించిన సురేందర్ రెడ్డిని కమిషన్ ప్రశ్నించింది. దిశ నిందితుల ఎన్కౌంటర్ జరిగిన తర్వాత ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసింది. రాచకొండ సీపీ మహేశ్ భగవత్ అధ్యక్షతన ఏర్పాటైన సిట్‌లో సురేందర్ రెడ్డి దర్యాప్తు అధికారిగా వ్యవహరించారు. సిట్ సమర్పించిన అఫిడవిట్లో నుంచి పలు వివరాలను కమిషన్ అడిగి తెలుసుకుంది. సిట్ తరఫున న్యాయవాదిగా వ్యవహరించిన పరమేశ్వర్.. సురేందర్ రెడ్డిని పలు ప్రశ్నలు వేశారు. నిందితులపై కాల్పులు జరిపే ముందు నిబంధనల ప్రకారం వ్యవహరించారా? లేరా? అని ప్రశ్నించారు. ఎన్ని రౌండ్ల కాల్పులు జరిపారు. కాల్పుల్లో పోలీసుల తరఫున ఎవరెవరు పాల్గొన్నారు... కాల్పులు జరిపిన సమయంలో ఆ బృందానికి ఎవరు నేతృత్వం వహించారనే ప్రశ్నలు వేశారు. ఈ ప్రశ్నలన్నింటికి అఫిడవిట్లో ఉన్న సమాధానాలతో పాటు... కొన్ని అదనపు సమాధానాలను సురేందర్ రెడ్డి వివరించారు. కమిషన్ నిర్ణయించిన ప్రణాళిక ప్రకారం ఈ నెల 21న ప్రభుత్వాన్ని... 26, 27, 28 తేదీల్లో 18మంది సాక్షులను విచారించాల్సి ఉంది. కానీ.. ప్రభుత్వం తరఫున హాజరైన సురేందర్ రెడ్డినే మూడు రోజుల పాటు విచారించింది. ఇంకా ఆయనను విచారించడం పూర్తి కాకపోవడంతో కమిషన్ మరోసారి హాజరు కావాలని ఆదేశించింది.
హాజరు కావొద్దంటూ బెదిరింపులు..