'ఈ చట్టంతోనైనా ప్రజలకు మేలు జరుగుతుందని ఆశిస్తున్నాం...'
12:01 September 11
నూతన రెవెన్యూ బిల్లుపై శాసనసభలో చర్చ
భూములకు సంబంధించి ఎన్ని చట్టాలు వచ్చిన ఆక్రమణలకు మాత్రం అడ్డుకట్టపడలేదని ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ తెలిపారు. నూతన రెవెన్యూ చట్టం తెచ్చిన సీఎం కేసీఆర్‌కు ధన్యావాదాలు తెలిపిన ఓవైసీ... ఈ చట్టం ద్వారా ప్రజలకు మేలు జరుగుతుందని ఆశిస్తున్నట్లు ఓవైసీ తెలిపారు. రెవెన్యూ బిల్లు చట్టానికి ఎంఐఎం పార్టీ మద్దతిస్తుందన్న అక్బరుద్దీన్... స్లమ్ ఏరియాల్లో నోటరీ ద్వారా కొనుగోలు చేసిన భూములకు రక్షణ కల్పించాలని కోరారు.
క్షేత్రస్థాయిలో ఉన్న భూమి రికార్టులో ఉన్న వివరాల్లో తేడాలు ఉన్నాయని అక్బరుద్దీన్ ఆరోపించారు. వక్ఫ్ భూములు, దర్గా భూములు చాలా చోట్ల ఆక్రమణలకు గురయ్యాయన్నారు. ఆక్రమణకు గురైన వక్ఫ్ భూములను కాపాడాలని విజ్ఞప్తి చేశారు.
హరితహారం కార్యక్రమం అద్భుతమని అక్బరుద్దీన్ కొనియాడారు. పట్టణాల్లో మరిన్ని గ్రీన్ జోన్లు ప్రకటించి అభివృద్ధి చేయాలని సూచించారు. గచ్చిబౌలి, హైటెక్‌సిటీ ప్రాంతాల్లో జరిగిన అభివృద్ధిలో మంత్రి కేటీఆర్ పాత్ర కీలకమని ఓవైసీ అభినందించారు.