ప్రస్తుతం ఇంటర్నెట్‌తో కూడిన స్మార్ట్‌ఫోన్ ప్రతి ఒక్కరి చేతిలో ఉంటోంది. లేదంటే అంతర్జాల సదుపాయం లేని ఫీచర్ ఫోన్లనూ వినియోగిస్తున్నారు. ఇంటర్నెట్ సదుపాయం ఉన్నా, లేకపోయినా ఆపద వేళ బాధితులు 100 నంబరుకు ఫోన్ చేసి, వీలైనంత తొందరగా ఉపశమనం పొందే అవకాశాన్ని తెలంగాణ పోలీసులు అవగాహన కల్పిస్తున్నారు. ఒకప్పుడు బాధితుల ఫోన్‌కు అంతర్జాల సదుపాయం ఉంటేనే వారున్న ప్రదేశాన్ని గుర్తించడం సాధ్యమయ్యేది. అప్పట్లో 100 నంబరుకు ఫోన్ చేసినా... ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారో తప్పనిసరిగా చెప్పాల్సి వచ్చేది. అలా చెప్పిన తర్వాతే సంబంధిత ఠాణా పోలీసులను డయల్ 100 సిబ్బంది అప్రమత్తం చేసేవారు. ఇప్పుడా బాధ లేదు. బాధితులు ఫోన్ చేసిన వెంటనే ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారన్నది అక్షాంశ, రేఖాంశాలతో సహా తెరపై కనిపిస్తుంది. దీంతో కాల్ వచ్చిన వెంటనే సమీపంలోని గస్తీ బృందాలు నిమిషాల వ్యవధిలోనే ఘటనాస్థలికి చేరుకోవడం సాధ్యమవుతోంది.
ఒక్క మీట నొక్కితే... ఒకేసారి ఐదుగురి అప్రమత్తం