దేశవ్యాప్తంగా మళ్లీ పెరుగుతున్న కరోనా కేసుల నేపథ్యంలో రాష్ట్రప్రభుత్వం అప్రమత్తంగా ఉందని ప్రజారోగ్య సంచాలకులు డాక్టర్ శ్రీనివాస్ తెలిపారు. కరోనా కట్టడి కోసం అన్ని రకాల చర్యలు తీసుకుంటుందన్నారు. గతంలో కరోనా గడ్డు పరిస్థితుల నుంచి నేర్చుకున్న పాఠాల ద్వారా పూర్తి సంసిద్ధత సాధించామని తెలిపారు.
'కరోనా కట్టడికి పూర్తి సంసిద్ధతతో ఉన్నాం'
రాష్ట్రవ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో అవసరం అయితే గాంధీని కొవిడ్ సేవలకు వినియోగించే అవకాశం ఉందని డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ డాక్టర్ శ్రీనివాస్ పేర్కొన్నారు. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆస్పత్రులను అప్రమత్తం చేశామన్నారు. కరోనా కట్టడికి పూర్తి సంసిద్ధతతో ఉన్నాం అంటున్న డీహెచ్ శ్రీనివాసరావుతో ఈటీవీ భారత్ ప్రతినిధి రమ్య ముఖాముఖి.
Dh Srinivas On Corona second wave in telangana