రాష్ట్రంలో కొవిడ్ నుంచి పోలీసులను కాపాడేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. పోలీసు ఉన్నతాధికారులతో దృశ్యమాధ్యమ సమీక్ష నిర్వహించిన డీజీపీ... కొవిడ్ సోకిన వారితో ప్రత్యేక వాట్సప్ గ్రూపులను రూపొందించినట్లు తెలిపారు. ఈ గ్రూపుల ద్వారా కరోనా బాధితుల్లో ఆత్మస్థైర్యం నింపే విధంగా సూచనలు సలహాలు ఇస్తున్నామన్నారు. హెల్త్ మానిటరింగ్ కోఆర్డినేషన్ కమిటీలను ఏర్పాటు చేశామని... ఎప్పటికప్పుడు ఈ కమిటీలు వారి ఆరోగ్య పరిస్థితి తెలుసుకుంటాయని వివరించారు. కమిషనరేట్, జిల్లా స్థాయిల్లో ఏర్పాటు చేసిన వాట్సప్ గ్రూపుల్లో స్థానిక పోలీసు అధికారులు, వైద్యులు ఉంటారన్నారు.
కొవిడ్ నుంచి పోలీసులను కాపాడేందుకు చర్యలు: డీజీపీ
పోలీసు ఉన్నతాధికారులతో డీజీపీ మహేందర్ రెడ్డి దృశ్యమాధ్యమ సమీక్ష నిర్వహించారు. కొవిడ్ నుంచి పోలీసులను కాపాడేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. కొవిడ్ సోకిన వారితో ప్రత్యేక వాట్సప్ గ్రూపులను రూపొందించి... ఎప్పటికప్పుడు వారి బాగోగులు తెలుసుకుంటున్నామని తెలిపారు.
Dgp Mahender Reddy review on Covid Among Police
పాజిటివ్ వచ్చిన వారితో అధికారులు జూమ్ సమావేశాలు నిర్వహించాలని డీజీపీ సూచించారు. ప్రతి ఒక్కరికీ కరోనా మెడికల్ కిట్లతో పాటు బలవర్ధకమైన డ్రైఫ్రూట్స్ అందించాలని అధికారులను ఆదేశించారు. ఎవరికైనా అత్యవసర పరిస్థితి ఎదురైతే వెంటనే... సమీప ఆస్పత్రుల్లో చేర్పించాలన్నారు. ఈ వీడియో కాన్ఫరెన్స్లో శాంతి భద్రతల విభాగం అడిషనల్ డీజీ జితేందర్, హోమ్ గార్డ్స్ ఏడీజీ బాల నాగాదేవి, డీఐజీ సుమతి పాల్గొన్నారు.