తెలంగాణ

telangana

ETV Bharat / city

devineni uma: దేవినేని ఉమా బెయిల్‌ పిటిషన్‌పై విచారణ వాయిదా - devineni uma bail petition

ఏపీకి చెందిన మాజీ మంత్రి దేవినేని ఉమా బెయిల్‌ పిటిషన్‌పై విచారణ వాయిదా పడింది. ఆ రాష్ట్ర హైకోర్టు విచారణను ఆగస్టు 3కు వాయిదా వేసింది.

దేవినేని ఉమా బెయిల్‌ పిటిషన్‌పై విచారణ వాయిదా
దేవినేని ఉమా బెయిల్‌ పిటిషన్‌పై విచారణ వాయిదా

By

Published : Jul 30, 2021, 6:26 PM IST

ఆంధ్రప్రదేశ్​కు చెందిన మాజీ మంత్రి దేవినేని ఉమా బెయిల్‌ పిటిషన్‌పై విచారణ వాయిదా పడింది. ఆ రాష్ట్ర హైకోర్టు విచారణను ఆగస్టు 3కు వాయిదా వేసింది. ప్రస్తుతం దేవినేని ఉమా రాజమహేంద్రవరం జైలులో ఉన్నారు.

దేవినేని ఉమాపై పోలీసులు.. కుట్ర, ఎస్సీ, ఎస్టీ కేసు అన్యాయంగా పెట్టారని పిటిషనర్ తరపు న్యాయవాది వ్యాజ్యంలో పేర్కొన్నారు. కేసుల్లో ఎలాంటి ఆధారాలు లేవని పిటిషన్​లో తెలిపారు. పిటిషనర్​కు బెయిల్ మంజూరు చేయాలని న్యాయవాది పిటిషన్​లో కోరారు.

అసలేం జరిగింది..

ఏపీలోని కృష్ణా జిల్లా కొండపల్లి అటవీ ప్రాంతంలో.. గ్రావెల్‌ అక్రమ మైనింగ్‌ జరుగుతుందనే ఆరోపణల నిజ నిర్ధరణకు వెళ్లిన మాజీ మంత్రి దేవినేని ఉమాపై వైకాపా వర్గీయులు రాళ్ల దాడి చేశారు. ఇది వైకాపా, తెలుగుదేశం వర్గీయుల మధ్య బాహాబాహీకి దారితీయటంతో.. పోలీసులు లాఠీఛార్జీ చేశారు. వాహనం ధ్వంసం చేయడంతో పాటు.. పలువురు గాయపడేందుకు కారణమైన వ్యక్తులను అరెస్టు చేయాలని కోరుతూ.. వాహనంలోనే ఉమా నిరసనకు దిగారు. దాదాపు ఆరు గంటలపాటు కారులోనే నిరసన తెలిపిన ఉమాను.. పోలీసులు బలవంతంగా అరెస్టు చేశారు. కారు అద్దం ధ్వంసం చేసి.. లోపలి నుంచి తలుపు తీసి.. ఉమాను బయటకు లాగారు.

సీఎం జగన్‌, ప్రభుత్వ సలహాదారు సజ్జల కనుసన్నల్లోనే.. ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్‌ దాడి చేయించారని దేవినేని ఉమా ఆరోపించారు. తన వ్యాఖ్యలను బలపరుస్తూ.. ఈ నెల 20వ తేదీన ఎమ్మెల్యే వసంతకృష్ణ ప్రసాద్‌ మాట్లాడిన వీడియోను నేతలు విడుదల చేశారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించారనే ఆరోపణతో దేవినేని ఉమాను అరెస్టు చేశామని పోలీసులు తెలిపారు. దాడి జరిగిందని ఫిర్యాదు చేసేందుకు వచ్చిన దేవినేని ఉమా కారులో నుంచి దిగకుండా ఇబ్బంది పెట్టేలా ఉద్దేశపూర్వకంగా ఘర్షణలు తలెత్తేలా వ్యవహరించారని అన్నారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా వర్గాలను రెచ్చగొట్టేలా దేవినేని ఉమా వ్యవహరించడంతో ఆయనపై కేసులు నమోదు చేశామన్నారు.

సంబంధిత కథనాలు:

Devineni Uma: బెయిల్ కోరతూ హైకోర్టులో దేవినేని ఉమా పిటిషన్

ఇదీ చూడండి: TRS MP KAVITHA: తెరాస ఎంపీ మాలోత్‌ కవితకు హైకోర్టులో ఊరట

ABOUT THE AUTHOR

...view details