సీసీఎంబీ సహా ఇతర జాతీయ పరిశోధన సంస్థల నుంచి నివేదిక వచ్చిన తర్వాతే ఏలూరులో తలెత్తిన కారణాలు తెలుస్తాయని ఏపీ ఉపముఖ్యమంత్రి ఆళ్ల నాని స్పష్టం చేశారు. ఏలూరు పరిస్థితి క్రమంగా మెరుగుపడుతోందని వింతవ్యాధి సోకిన రోగులు ఇవాళ్టికి 120 మందికి ఈ సంఖ్య దిగివచ్చినట్లు తెలిపారు.
నివేదికలు వస్తేనే... కారణాలు తెలుస్తాయి: ఆళ్ల నాని - ఏలూరు అప్డేట్స్
ఏలూరు పరిసర ప్రాంతాల్లో నీటి సరఫరా జరుగుతున్న ఓవర్ హెడ్‌ట్యాంకులను ఏపీ ఉపముఖ్యమంత్రి ఆళ్ల నాని అధికారులతో కలిసి పరిశీలించారు.
aalla naani
ఏలూరు పరిసర ప్రాంతాల్లో నీటి సరఫరా జరుగుతున్న ఓవర్ హెడ్‌ట్యాంకులను అధికారులతో కలిసి పరిశీలించారు. ప్రాథమిక నివేదకలో సీసం వంటి భార లోహాలు మోతాదు మించి ఉన్నట్లుగా తేలినప్పటికీ పూర్తిస్థాయిలో నిర్ధరించాల్సి ఉందన్నారు.
ఇదీ చదవండి:సన్నరకాలకు మద్దతు ధర ఇవ్వకుండా కేంద్రం అడ్డుపడుతోంది: కేటీఆర్