వికారాబాద్ జిల్లా కేంద్రంలోని చిగుర్లపల్లి అపార్ట్మెంట్లో ఎటువంటి అనుమతులు లేకుండా నడుపుతున్న పాఠశాలపై చర్యలు తీసుకోవాలంటూ జిల్లా విద్యాధికారి రేణుకాదేవి ఆదేశాలు జారీ చేశారు. గత కొన్ని సంవత్సరాలుగా కృష్ణవేణి టాలెంట్ స్కూల్ పేరిట నడుస్తున్న పాఠశాలను కొందరు వ్యక్తులు కొనుగోలు చేసి, డాక్టర్స్ హైదరాబాద్ ఇంటర్నేషనల్ స్కూల్ పేరుతో విద్యాశాఖకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా చిగుర్లపల్లి అపార్ట్మెంట్కి మార్చారు. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా జెండా ఎగురవేయలేదని సోషల్ మీడియాలో హల్చల్ కావడంతో డీఈవో రేణుకాదేవి పాఠశాలను సందర్శించారు. కనీస అనుమతులు లేకుండా అపార్ట్మెంట్లో పాఠశాలను ఏర్పాటు చేయడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. రెండు రోజుల్లో నిబంధనలు పాటించని పక్షంలో పాఠశాల సీజ్ చేయాలని ఎంఈవో బాబు సింగ్ను ఆమె ఆదేశించారు.
అనుమతులు లేని పాఠశాలను సీజ్ చేసిన డీఈవో - అనుమతులు లేని పాఠశాల
కనీస అనుమతులు లేకుండా నడుపుతున్న ఓ పాఠశాలపై చర్యలు తీసుకోవాలని వికారాబాద్ డీఈవో ఆదేశాలు జారీ చేశారు. నిబంధనలు పాటిస్తూ రెండు రోజుల్లో తిరిగి పాఠశాలను ఏర్పాటు చేయని పక్షంలో సీజ్ చేయాలని ఎంఈవో బాబు సింగ్ను ఆదేశించారు.
అనుమతులు లేని పాఠశాలను సీజ్ చేసిన డీఈవో