తెలంగాణ

telangana

ETV Bharat / city

PAWAN TWEET: సీఎం స్టాలిన్​పై పవన్​ ట్వీట్​.. తమిళనాడు అసెంబ్లీలో చర్చ - తమిళనాడు అసెంబ్లీ

జనసేన అధినేత పవన్ కల్యాణ్ తమిళనాడు సీఎం స్టాలిన్​పై చేసిన ట్వీట్​ గురించి ఆ రాష్ట్ర శాసనసభలో చర్చ జరిగింది. ప్రభుత్వంలోకి రావడానికి రాజకీయాలు చేయాలే తప్ప... అధికారంలోకి వచ్చాక రాజకీయం చేయకూడదనే మాటలను ఆరోగ్యశాఖ మంత్రి సుబ్రమణియన్.. తమిళంతో పాటు తెలుగులోనూ చెప్పారు.

pspk
pspk

By

Published : Sep 3, 2021, 3:27 PM IST

జనసేన అధినేత, సినీ నటుడు పవన్‌కల్యాణ్‌ చేసిన ఓ ట్వీట్(PAWANKALYAN TWEET)పై తమిళనాడు శాసనసభలో చర్చ జరిగింది. శాసనసభలో ఆరోగ్యశాఖ మంత్రి సుబ్రమణియన్‌ ప్రసంగిస్తూ.. ఈ ట్వీట్‌ గురించి ప్రస్తావించారు. ప్రతిపక్షం, అధికారపక్షం అనే తేడా లేకుండా తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్‌ అందరినీ భాగస్వాములను చేస్తూ... వారికి సముచిత గౌరవం కలిపిస్తూ పరిపాలన చేస్తుండడాన్ని పవన్‌ తన ట్వీట్‌లో ప్రశంసించారు.


ప్రభుత్వంలోకి రావడానికి రాజకీయాలు చేయాలే తప్ప... అధికారంలోకి వచ్చాక రాజకీయం చేయకూడదనే మాటలను చేతల్లో చూపిస్తున్నారని ఆరోగ్య మంత్రి సుబ్రమణియన్‌ తమిళనాడు శాసనసభలో తమిళంతోపాటు తెలుగులోనూ తెలిపారు.


ఇదీ చూడండి: ఆ రాష్ట్ర రాజకీయాల్ని కుదిపేస్తున్న పురందేశ్వరి వ్యాఖ్యలు

ABOUT THE AUTHOR

...view details