భారీ వర్షాల ధాటికి రాష్ట్రంలో ఇప్పటి వరకు 70 మంది చనిపోయారని మంత్రి కేటీఆర్ వివరించారు. జీహెచ్ఎంసీ పరిధిలో 33 మంది మరణించారని ప్రకటించారు. ఇప్పటి వరకు 29 మందికి రూ. 5 లక్షల చొప్పున సాయం అందించామని తెలిపారు. గల్లంతు అయిన మరో ముగ్గురిని గుర్తించే ప్రక్రియ కొనసాగుతోందన్నారు. వరద బాధితులు, మరణాలపై ప్రభుత్వం వద్ద పూర్తి సమాచారం ఉందని వివరించారు.
గ్రేటర్ పరిధిలోనే 33 మంది మృతి: కేటీఆర్ - తెలంగాణలో మృతుల సంఖ్య
భారీ వర్షాలు 70 మందిని బలితీసుకున్నాయి. గ్రేటర్ పరిధిలోనే 33 మంది మరణించినట్లు ప్రభుత్వం ప్రకటించింది. వరద బాధితులు, మరణాలపై ప్రభుత్వం వద్ద పూర్తి సమాచారం ఉందని మంత్రి కేటీఆర్ వివరించారు.
గ్రేటర్ పరిధిలోనే 33 మంది మృతి: కేటీఆర్
వర్షం కారణంగా తలెత్తే ఇబ్బందులను ఎదుర్కొనేందుకు 80మంది సీనియర్ అధికారులను వరద సహాయక చర్యల్లో పాల్గొంటారని, వీరంతా ఇదే పనిలో 15 రోజులపాటు ప్రాణనష్టం జరగకుండా చూస్తారని కేటీఆర్ స్పష్టం చేశారు.
ఇవీ చూడండి:మళ్లీ వరుణ ప్రతాపం.. అప్రమత్తంగా ఉండాలని అధికారుల ఆదేశం