తెలంగాణ

telangana

దసరాకు మరో 10 ప్రత్యేక రైళ్లు

కరోనా మహమ్మారి కారణంగా దేశ వ్యాప్తంగా రైళ్లను పరిమిత సంఖ్యలో రైల్వేశాఖ నడుపుతోంది. అయితే దసరా పండగ సీజన్‌ కారణంగా దేశ వ్యాప్తంగా మరికొన్ని రైళ్లను నడిపేందుకు సిద్ధమైంది. ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని దక్షిణ మధ్య రైల్వే మరో 10 ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసింది.

By

Published : Oct 15, 2020, 7:47 AM IST

Published : Oct 15, 2020, 7:47 AM IST

Dasara Festival Special Trains in South central railway
దసరాకు మరో 10 ప్రత్యేక రైళ్లు

దసరా పండగ సమీపిస్తున్న వేళ ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని దక్షిణ మధ్య రైల్వే మరో 10 ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసింది. కాకినాడ - లింగంపల్లి; తిరుపతి -లింగంపల్లి; నర్సాపూర్‌ - లింగంపల్లితో పాటు విజయవాడ -హుబ్లీ, తిరుపతి - అమరావతి మార్గాల్లో ఈ రైలు సర్వీసులను నడపనున్నట్టు వెల్లడించింది. ఈ మేరకు బుధవారం రాత్రి ఓ ప్రకటన విడుదల చేసింది. ఈ నెల 20న నుంచి నవంబర్‌ 30 వరకు కాకినాడ - లింగంపల్లి, తిరుపతి - లింగంపల్లి మధ్య ప్రత్యేక రైలు సర్వీసులను నడుపుతామని తెలిపింది. అలాగే, నర్సాపూర్‌ - లింగంపల్లి స్టేషన్ల మధ్య ఈ నెల 23 నుంచి నవంబర్‌ 30 తేదీల మధ్య రైలు సర్వీసులు నడుస్తాయని అధికారులు పేర్కొన్నారు.

విజయవాడ -హుబ్లీ; హుబ్లీ - విజయవాడ మధ్య ఈ నెల 21 నుంచి నవంబర్‌ 30 వరకు ప్రతి రోజూ రైలు సర్వీసులు నడపనున్నట్లు తెలిపారు. అలాగే, తిరుపతి నుంచి మహారాష్ట్రలోని అమరావతికి ఈ నెల 20 నుంచి నవంబర్‌ 28 వరకు ప్రతి మంగళ, శనివారాల్లో నడపనున్నారు. అలాగే, అమరావతి నుంచి తిరుపతికి ఈ నెల 22 నుంచి నవంబర్‌ 30 వరకు ప్రతి గురు, సోమవారాల్లో ఈ సర్వీసులు నడవనున్నాయి.

ఇవీచూడండి:కరోనా ఎఫెక్ట్​: పలు రైళ్లు రద్దు

ABOUT THE AUTHOR

...view details