తెలంగాణ

telangana

ETV Bharat / city

cyclone gulab: తీరం దాటిన గులాబ్‌.. రాష్ట్రంలో నేడు కుంభవృష్టి

ఆదివారం రాత్రి గులాబ్‌ తుపాను తీరం దాటింది. దీని ప్రభావంతో రాష్ట్రంలో సోమవారం కుంభవృష్టి, మంగళవారం భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తమైంది. దిల్లీ పర్యటనలో ఉన్న సీఎం కేసీఆర్‌ ఆదేశాల మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పరిస్థితిపై సమీక్షించారు. కలెక్టరేట్‌లలో ప్రత్యేక కంట్రోల్‌ రూమ్‌లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. లోతట్టు ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు.

cyclone gulab
cyclone gulab

By

Published : Sep 27, 2021, 5:45 AM IST

cyclone gulab: తీరం దాటిన గులాబ్‌.. రాష్ట్రంలో నేడు కుంభవృష్టి

గులాబ్‌ తుపాను ఆదివారం రాత్రి తీరం దాటింది. దీని ప్రభావంతో రాష్ట్రంలో సోమవారం కుంభవృష్టి, మంగళవారం భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తమైంది. దిల్లీ పర్యటనలో ఉన్న సీఎం కేసీఆర్‌ ఆదేశాల మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పరిస్థితిపై సమీక్షించారు. కలెక్టరేట్‌లలో ప్రత్యేక కంట్రోల్‌ రూమ్‌లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. లోతట్టు ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. తుపాను నేపథ్యంలో రైల్వేశాఖ పలు రైళ్లను రద్దు చేసింది. మరికొన్నింటిని దారిమళ్లించింది. విద్యుత్తు శాఖ అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని టీఎస్‌ఎస్పీడీసీఎల్‌ సీఎండీ జి.రఘుమారెడ్డి ఆదేశాలు జారీ చేశారు. అత్యవసర పరిస్థితుల్లో ప్రజలు 1912, 100 టోల్‌ఫ్రీ నంబర్లకు ఫిర్యాదు చేయాలని సూచించారు.

రెడ్​ అలెర్ట్​ జారీ..

బంగాళాఖాతంలో ఏర్పడిన గులాబ్‌ తుపాను కారణంగా సోమవారం తెలంగాణలో అత్యంత భారీ కుంభవృష్టి, మంగళవారం భారీ వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ ఎరుపు రంగు హెచ్చరికలు జారీ చేసింది. కుంభవృష్టి వర్షాలు పడతాయనే సూచనలుంటే ఎరుపు, భారీ వర్షాలైతే ఆరెంజ్‌, ఓ మోస్తరు వర్షాలకు పసుపు రంగు హెచ్చరికలు జారీ చేయడం ఆనవాయితీ. సోమవారం బంగాళాఖాతంలో మరో ఉపరితల ఆవర్తనం ఏర్పడనుంది. దీని ప్రభావంతో మంగళవారం మరో అల్పపీడనం ఏర్పడి ఈ నెల 29 నాటికి బెంగాల్‌ వైపు వెళ్తుందని అంచనా. సోమవారం తెలంగాణలో 40 కి.మీ. వేగంతో గాలులు, ఉరుములతో వర్షాలు కురుస్తాయని తెలిపింది. సోమవారం అత్యంత భారీ వర్షాలకు అవకాశాలున్నందున ప్రజలు అవసరమైతే తప్ప బయట తిరగవద్దని వాతావరణ శాఖ సూచించింది.

పలు రైళ్ల రద్దు

తుపాను నేపథ్యంలో ఒడిశా వైపు నుంచి తెలుగు రాష్ట్రాల మీదుగా రాకపోకలు సాగించే 13 రైళ్లను రైల్వేశాఖ రద్దు చేసింది. మరో 16 రైళ్లను దారిమళ్లించింది. వీటిలో సోమవారం(27న) బయలుదేరాల్సిన కేఎస్‌ఆర్‌ బెంగళూరు సిటీ-భువనేశ్వర్‌, యశ్వంత్‌పుర్‌-బెంగళూరు, తిరుపతి-భువనేశ్వర్‌, చెన్నై సెంట్రల్‌-పూరీ, హెచ్‌ఎస్‌ నాందేడ్‌-సంబల్‌పుర్‌, కోయంబత్తూర్‌-ముంబయి ఎల్‌టీటీ రైళ్లు ఉన్నాయి. గుంటూరు-రాయగడ రైలును పాక్షికంగా రద్దు చేశారు. పలు రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి.

ప్రాణ, ఆస్తినష్టాలు నివారించాలి: సీఎస్‌

తుపాన్‌ నేపథ్యంలో అన్ని జిల్లాల్లో యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్లను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ ఆదివారం ఆదేశించారు. ప్రాణ, ఆస్తినష్టం వాటిల్లకుండా నివారించాలన్నారు. రోడ్లు, భవనాల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సునీల్‌శర్మ, విపత్తు నిర్వహణ శాఖ కార్యదర్శి రాహుల్‌ బొజ్జా, పంచాయతీరాజ్‌, కార్యదర్శి సందీప్‌ సుల్తానియా, కలెక్టర్లతో టెలికాన్ఫరెన్స్‌ నిర్వహించారు. అవసరమైతే ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాల సేవలను వినియోగించుకోవాలన్నారు. వాగుల వద్ద వరద సమయంలో ప్రజలు, వాహనాలు దాటకుండా చూడాలన్నారు. చెరువులు, జలాశయాల నీటిమట్టాలను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ముందస్తు చర్యలు చేపట్టాలన్నారు.

ఇవీచూడండి:తీరం దాటిని 'గులాబ్​'- ఒడిశాలో అతి భారీ వర్షాలు!

ABOUT THE AUTHOR

...view details