నకిలీ ఫేస్ బుక్ ఖాతాలు ఇటీవల భారీ స్థాయిలో పుట్టుకొస్తున్నాయి. దీనిపై చాలా వరకు ప్రజలు అప్రమత్తంగా ఉంటున్నా... సైబర్ నేరగాళ్లు నకిలీ ఐడీలను ఏదో ఒక రూపంలో దుర్వినియోగం చేసే ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. నకిలీ ఐడీలను సృష్టించి నగరానికి చెందిన ఓ మహిళ వ్యక్తిగత ఫోటోలను పోస్టు చేశారు. వీటిని గమనించిన ఆమె భర్త సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించాడు.
తస్మాత్ జాగ్రత్త: నకిలీ ఐడీలతో సైబర్ నేరగాళ్ల వల - cyber crimes updates
కొంచెం ఏమరపాటుగా ఉన్నా సరే ప్రజల ఖాతాల్లోని డబ్బును సైబర్ నేరగాళ్లు క్షణంలో మాయం చేసేస్తున్నారు. నకిలీ ఐడీలను ఏదో ఒక రూపంలో దుర్వినియోగం చేసే ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. తాజాగా ఓ మహిళ వ్యక్తిగత ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో దర్శనమివ్వగా.. మరో ఇద్దరు తమకు తెలియకుండానే తమ ఖాతాలోని డబ్బును సైబర్ నేరగాళ్లకు సమర్పించుకున్నారు.
తస్మాత్ జాగ్రత్త: నకిలీ ఐడీలతో సైబర్ నేరగాళ్ల వల
మరో ఘటనలో ఓఎల్ఎక్స్లో ప్రకటనలు చూసి ఓ వ్యక్తి 56వేలు మోసపోయాడు. ఇంకో ఘటనలో బాధితుడికి సంబంధం లేకుండానే అతడి ఖాతా నుంచి 97వేల రూపాయలను సైబర్ నేరగాళ్లు కాజేశారు. ఆయా ఘటనలపై బాధితులు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
Last Updated : Oct 24, 2020, 5:38 PM IST