ఉల్లిగడ్డ ధర బహిరంగ మార్కెట్లో రూ.90లకుపైగా పలుకుతున్నందున... రాష్ట్ర ప్రభుత్వం రాయితీపై అందించేందుకు నిర్ణయించింది. హైదరాబాద్‌లోని రైతు బజార్లలో సబ్సిడీ ధరకు విక్రయించేందుకు ఏర్పాట్లు చేసింది. నగరంలోని 11 రైతు బజార్లలో కిలో ఉల్లి రూ.35కు సరఫరా చేపట్టింది.
ప్రభుత్వం ప్రకటన చేసింది.. జనం బారులు తీరారు.. - రైతుబజార్ల ముందు భారీ క్యూ
బహిరంగ మర్కెట్లో కిలో ధర దాదాపు రూ.90 పలుకుతోంది. దీంతో ధరలు నియత్రించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. కిలో ఉల్లి రూ.35లకే నగరంలోని రైతు బజార్ల విక్రయించేందుకు నిర్ణయించింది. ప్రభుత్వ ప్రకటన రాగానే... ప్రజలు రైతు బజార్ల ముందు బారులు తీరారు.
పండుగ సమయం కావడంతో ప్రభుత్వ ప్రకటన రాగానే.. ప్రజలు రైతు బజార్ల ముందు బారులు తీరారు. ఎర్రగడ్డ రైతు బజార్ వద్ద మధ్యాహ్నానికే పెద్ద క్యూలైను కనిపించింది. కిలో రూ.35కు ఒక వ్యక్తికి రెండు కిలోలు చొప్పున ఇస్తున్నారు. గుర్తింపు కోసం ఆధార్, ఓటర్ కార్డు వంటి ఏదైనా తీసుకురావాలని ప్రభుత్వం సూచించింది. ఒక వ్యక్తికి రెండు కిలోల నిబంధన ఉన్నందున... ఒకే కుటుంబంలో ఇద్దరు, ముగ్గురు కూడా లైను రైతు బజార్ల ముందు నిలబడ్డారు.
ఇదీ చూడండి:భాగ్యనగరంలో కిలో ఉల్లి 35 రూపాయలే...: మంత్రి నిరంజన్‌రెడ్డి