తెలంగాణ

telangana

ETV Bharat / city

వీలైనంత ఎక్కువ రుణాలు ఇప్పించాలి: సీఎస్​ - ఆత్మ నిర్భర్ ప్యాకేజీపై సీఎస్​ సమీక్ష

ఆత్మనిర్బర్ ప్యాకేజీ ద్వారా సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు అందించే రుణాలపై ఉన్నతాధికారులు, కలెక్టర్లు, బ్యాంకర్లతో... ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్​ దృశ్యమాధ్యమ సమీక్ష నిర్వహించారు. అర్హులైన ప్రతి ఒక్కరికి వీలైనంత వరకు రుణాలు అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.

cs somesh kumar review on athma nirbhar package loans
వీలైనంత ఎక్కువ రుణాలు ఇప్పించాలి: సీఎస్​

By

Published : Aug 6, 2020, 7:46 PM IST

ఆత్మనిర్బర్ ప్యాకేజీ ద్వారా సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు వీలైనంత ఎక్కువగా రుణాలు లభించేలా చూడాలని... ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ కలెక్టర్లకు సూచించారు. ఈ మేరకు... ఉన్నతాధికారులు, కలెక్టర్లు, బ్యాంకర్లతో ఇవాళ దృశ్యమాధ్యమ సమీక్ష నిర్వహించారు. గ్యారెంటీ ఎమర్జెన్సీ క్రెడిట్ లైన్ క్రింద పూచికత్తు లేని రుణాలు అందించేందుకు కలెక్టర్లు కృషి చేయాలని సూచించారు.

ఎక్కవ మందికి లబ్ది చేకూర్చేలా కలెక్టర్లు, పరిశ్రమల శాఖ జిల్లా మేనేజర్లు, లీడ్ బ్యాంక్ మేనేజర్లతో తరచూ సమీక్షించాలని సీఎస్​ సూచించారు. రుణాలకు ఎలాంటి పరిమితి లేనందున సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు వీలైనంత ఎక్కువగా రుణసదుపాయం కల్పించడంపై దృష్ఠి సారించాలని తెలిపారు. అర్హత ఉన్న పరిశ్రమల జాబితా అందించాలని, తమకు కేటాంయించిన లక్ష్యాల మేరకు రుణాలు అందించాలని బ్యాంకర్లను సోమేశ్ కుమార్ కోరారు.

ABOUT THE AUTHOR

...view details