Blood donation camp: సామాజిక బాధ్యతగా పలు సేవా కార్యక్రమాలు నిర్వహించడంలో ముందుండే ఏకైక యానిమేషన్ శిక్షణా సంస్థ క్రియేటివ్ మల్టీమీడియారెడ్క్రాస్ సోసైటీతో కలిసి మరొక స్వచ్ఛంద సేవా కార్యక్రమాన్ని నిర్వహించింది. ప్రపంచ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ సంస్థలలో పనిచేసే సిబ్బంది, శిక్షణ పొందుతున్న విద్యార్థినీ విద్యార్థులు కలిసి హైదరాబాద్ దిల్సుఖ్నగర్లోని సంస్థ ఆవరణలో రక్తదాన శిబిరాన్ని నిర్వహించి ఇతరులకు ఆదర్శంగా నిలుస్తున్నారు.
దేశంలోనే పెద్ద ఎత్తున చేపట్టే రక్తదాన శిబిరం..
ప్రపంచ మహిళా దినోత్సవం సందర్భంగా 'తలసేమియా' వ్యాధి బారిన పడ్డ చిన్నారుల కోసం ఈ రక్తదాన శిబిరాన్ని విజయవంతంగా నిర్వహించినట్లు ఈ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ రాజశేఖర్ బుగ్గవీటి తెలిపారు. మన దేశంలో రక్తదాన శిబిరాన్ని పెద్ద ఎత్తున నిర్వహిస్తున్న యానిమేషన్ శిక్షణా సంస్థ క్రియేటివ్ మల్టీమీడియామాత్రమే కావడం గమనార్హం. ఈ సందర్భంగా సిబ్బంది, విద్యార్థులు కలిసి 150 యూనిట్ల రక్తాన్ని దానం చేసి ఇతరులకు ఆదర్శంగా నిలిచారు.
ఇదొక అపూర్వ అవకాశం..