తెలంగాణ

telangana

ETV Bharat / city

'ముస్లిం, మైనార్టీలు ఏ ఆధారాలు చూపించాలి'

ముస్లిం మైనారిటీలు, సంచార జాతులు, ఆదివాసీలు తమ పౌరసత్వం నిరూపించుకునేందుకు ఎలాంటి ఆధారాలు చూపించాలని సీపీఐ(ఎం) జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి ప్రశ్నించారు. హైదరాబాద్​ ఓయూలో ఎస్​ఎఫ్​ఐ నిర్వహించిన సమావేశంలో విద్యార్థి సంఘాలతో ఆయన సమావేశమయ్యారు.

cpm leader sitaram yechuri spoke on caa at osmania university
ముస్లిం మైనార్టీలు ఏ ఆధారాలు చూపించాలి: సీతారాం ఏచూరి

By

Published : Dec 27, 2019, 8:02 PM IST

హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీలో ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో నిర్వహించిన 'సేవ్ ఇండియా- సేవ్ కాన్సిటిట్యూషన్' కార్యక్రమంలో సీపీఐ(ఎం) జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి పాల్గొన్నారు. ఓయూలోని అన్ని విద్యార్థి సంఘాలతో ఆయన సమావేశమయ్యారు. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన జాతీయ పౌర చట్టాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. ఈ చట్టం ద్వారా దేశంలోని కొన్ని రాష్ట్రాల్లో 20 లక్షలకు పైగా పౌరసత్వం కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ చట్టం భారత రాజ్యాంగానికి పూర్తిగా వ్యతిరేకమని పేర్కొన్నారు. లౌకిక దేశాన్ని హిందూదేశంగా మార్చాలని భాజపా ప్రయత్నిస్తోందని అరోపించారు. వెంటనే ఈ చట్టాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.

ముస్లిం మైనార్టీలు ఏ ఆధారాలు చూపించాలి: సీతారాం ఏచూరి

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details