రాష్ట్ర మాజీ హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి మృతి తీవ్ర దిగ్భ్రాంతిని కలగించిందని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు. మంత్రిగా.. ఎమ్మెల్యేగా.. కార్మిక నేతగా ఆయన ఎన్నో సేవలు చేశారని తెలిపారు. జీవిత చరమాంకంలో నర్సింహారెడ్డిని కొంత రాజకీయ అసంతృప్తి వెంటాడిందని చెప్పారు. నిబద్ధతగా జీవితాన్ని ముగించిన గొప్ప నేతగా అభివర్ణించారు.
'చరమాంకంలో నర్సన్నను రాజకీయ అసంతృప్తి వెంటాడింది' - farmer minitser nayini's death
మాజీ మంత్రి నాయిని నర్సింహారెడ్డి మరణం కార్మిక లోకానికి తీరని లోటని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు. కార్మిక లోకానికి ఆయన ఎనలేని సేవలు చేశారని కొనియాడారు.
సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ
నర్సింహారెడ్డి మరణం కార్మిక లోకానికి తీరనిలోటన్న నారాయణ.. ఆయన మృతి పట్ల సంతాపం తెలియజేశారు. నాయిని కుటుంబానికి, కార్మిక లోకాని సానుభూతి ప్రకటించారు.