మూడు వ్యవసాయ చట్టాలపై కేంద్ర వైఖరిని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ తీవ్రంగా ఖండించారు. కేంద్ర ప్రభుత్వం అప్రజాస్వామికంగా తీసుకువచ్చి మొండిగా వ్యవహరిస్తోందని విమర్శించారు. రైతుల ఉద్యమాన్ని అణచివేయాలని చూస్తే దేశంలో సివిల్ వార్ వచ్చే అవకాశం ఉందని వ్యాఖ్యానించారు. అటువంటి పరిస్థితులను కేంద్రం పనిగట్టుకొని సృష్టిస్తోందని ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
అణచివేయాలని చూస్తే దేశంలో సివిల్ వారే: నారాయణ - సీపీఐ తాజా వార్తలు
వ్యవసాయ చట్టాలు రైతులకు జీవన్మరణ సమస్యగా మారాయని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ పేర్కొన్నారు. రైతుల ఉద్యమాన్ని అణచివేయాలని చూస్తే దేశంలో సివిల్ వార్ వచ్చే అవకాశం ఉందన్నారు. కేంద్రం మొండి వైఖరిని వీడి.. ఎటువంటి షరతులు లేకుండా చట్టాలను ఉపసంహరించాలని నారాయణ డిమాండ్ చేశారు.
అణచివేయాలని చూస్తే దేశంలో సివిల్ వారే: నారాయణ
వ్యవసాయ చట్టాలు రైతులకు జీవన్మరణ సమస్యగా మారాయన్నారు. ఆ చట్టాలు అమలైతే రైతులందరూ కూలీలుగా మారతారని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్రానికి ప్రజాస్వామ్యం, రాజ్యాంగంపై ఏ మాత్రం గౌరవమున్నా అప్రజాస్వామికంగా చేసిన చట్టాల విషయంలో చర్చలు కొనసాగించాలని.. ఎటువంటి షరతులు లేకుండా ఉపసంహరించాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో దేశంలో శాంతిని నెలకొల్పడం సాధ్యం కాదని హెచ్చరించారు.
ఇదీ చూడండి: మే 17 నుంచి 26 వరకు పదో తరగతి వార్షిక పరీక్షలు
TAGGED:
narayana on agriculture acts