తెలంగాణ

telangana

ETV Bharat / city

ప్రైవేటీకరిస్తే కార్మికుల శవాలపై బస్సులు నడపాలి: నారాయణ

ఆర్టీసీ కార్మికుల సమ్మెకు అన్నివర్గాల ప్రజలు అండగా ఉన్నారని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ తెలిపారు. సీఎం కేసీఆర్​ డెడ్​లైన్​ పెట్టినా... 360 మందే చేరారని అన్నారు. కాచిగూడ బస్ డిపో ముందు ఆర్టీసీ కార్మికులు తలపెట్టిన నిరసన కార్యక్రమంలో నారాయణ పాల్గొన్నారు.

cpi narayana

By

Published : Nov 6, 2019, 11:38 AM IST


సీఎం కేసీఆర్ డెడ్​లైన్ పెట్టినా.. బెదిరించినా 360 మంది కార్మికులు మాత్రమే విధుల్లో చేరారని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు. చేరిన వాళ్లలో డ్రైవర్లు, కండక్టర్లు లేనేలేరన్నారు. కాచిగూడ బస్ డిపో ముందు ఆర్టీసీ కార్మికులు నిర్వహించిన నిరసన కార్యక్రమంలో నారాయణ పాల్గొన్నారు.

ఆర్టీసీని ప్రైవేటీకరిస్తే కార్మికుల శవాలపైన మాత్రమే ప్రైవేట్ బస్సులు వెళ్లాల్సి ఉంటుందని హెచ్చరించారు. ప్రభుత్వం ప్రైవేట్ బస్సులను నడిపితే కార్మికులు ఎక్కడికక్కడ అడ్డుకుంటారని... అవసరమైతే తగులబెడతారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ఐకాస నేతలను ప్రభుత్వం చర్చలకు పిలవాలని డిమాండ్ చేశారు. ఆందోళనకారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా కాసేపు ఉద్రిక్తత తలెత్తింది.

ప్రైవేటీకరిస్తే కార్మికుల శవాలపై బస్సులు నడపాలి: నారాయణ

ఇవీ చూడండి: ముగిసిన డెడ్​లైన్​... తర్వాత ఏం జరగనుందో..?

ABOUT THE AUTHOR

...view details