ముఖ్యమంత్రి కేసీఆర్ ఆర్టీసీ సమ్మెను పక్కదారి పట్టించడానికి, కాలయాపన చేయడానికే త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేశారని సీపీఐ నేత నారాయణ ఆరోపించారు. ఎప్పుడో పరిష్కరించాల్సిన ఈ అంశాన్ని కాలయాపన చేస్తూ ఇన్ని రోజులు ఆపారని విమర్శించారు. రవాణా మంత్రి నాకేం తెలియదని... అంతా ముఖ్యమంత్రికే తెలుసని చేతులెత్తేశారని ఎద్దేవా చేశారు. ఎస్మా యాక్ట్ అని పంతాలకు పోకుండా వెంటనే చర్చించి దీనిపై నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వానికి సూచించారు. దిల్లీకి వెళ్లి ప్రధానిని, అమిత్‌షాను కలిసిన కేసీఆర్ యురేనియం విషయాన్ని ఎందుకు ప్రస్తావించలేదని ప్రశ్నించారు. అసెంబ్లీలో తీర్మానం చేసిన ప్రభుత్వం ప్రధానితో ఎందుకు చర్చించలేదన్నారు.
'ఆర్టీసీ సమ్మెపై పంతాలకు పోకుండా నిర్ణయం తీసుకోండి'
ఆర్టీసీ సమ్మెపై తెరాస సర్కారు... ఎస్మా యాక్ట్ అంటూ పంతాలకు పోకుండా చర్చించి నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వాన్ని సీపీఐ నేత నారాయణ విజ్ఞప్తి చేశారు.
'ఆర్టీసీ సమ్మెపై పంతాలకు పోకుండా నిర్ణయం తీసుకోండి'