తెలంగాణ

telangana

By

Published : Feb 21, 2020, 1:53 PM IST

ETV Bharat / city

సమాజం మార్పునకు తయారు చేసిన ఆయుధమే 'కమ్యూనిస్ట్​ మానిఫెస్టో'

'కమ్యూనిస్ట్ మానిఫెస్టో' విడుదలై నేటికి 172 వసంతాలు పూర్తైన సందర్భంగా దిల్లీలో కమ్యూనిస్టుల ఆధ్వర్యంలో 'రెడ్​ బుక్స్​డే' నిర్వహించారు. మార్క్స్, ఎంగెల్స్ రచించిన కమ్యూనిస్​ మానిఫెస్టో సమాజ మార్పునకు తయారు చేసిన ఓ గొప్ప ఆయుధంగా కమ్యునిస్టు నేతలు అభివర్ణించారు. ​​

cpi narayana on communist manifesto book on its anniversary
సమాజమార్పునకు తయారు చేసిన ఆయుధమే 'కమ్యూనిస్ట్​ మానిఫెస్టో'

1848 ఫిబ్రవరి 21న కారల్ మార్క్స్​, ఎంగెల్స్​ రచించిన కమ్యూనిస్ట్​ మానిఫెస్టో విడుదలైంది. నేటికి 172 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా దిల్లీలోని అజోయ్​ భవన్​లో కమ్యూనిస్టుల ఆధ్వర్యంలో ఆవిర్భావ దినోత్సవ వేడుకలు నిర్వహించారు. సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ, సీపీఎం పొలిట్​బ్యూరో సభ్యులు రాఘవులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.

48 పేజీల కమ్యూనిస్ట్​ మానిఫెస్టో విడుదలైనప్పడే.. బూర్జువా వర్గం గుర్తించి దానికి వ్యతిరేకంగా కుట్రపన్నారని ఆయన అన్నారు. ఈ పుస్తకం విడుదలకు ముందే సామాజికవేత్తలు సమాజం ఎదుర్కొంటున్న సవాళ్లను, పేదరికాన్ని గుర్తించినప్పటికీ... దానికి పరిష్కారమార్గం కనిపెట్టలేదన్నారు. సమాజమార్పునకు తయారు చేసిన ఆయుధమే ఈ 'కమ్యూనిస్ట్​ మానిఫెస్టో' అని నారాయణ అన్నారు.

172 వసంతాలు పూర్తి చేసుకున్నప్పటికీ ఈ పుస్తకానికున్న ప్రాసంగికత ఏ మాత్రం తగ్గలేదని సీపీఎం పొలిట్​బ్యూరో సభ్యులు బీవీ రాఘవులు అన్నారు. మనచుట్టూ ఉన్న విషయాలనే ఈ గ్రంథం వివరిస్తుందని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా మానిఫెస్టో తెలుగు అనువాద పుస్తకాన్ని ఆవిష్కరించారు.

సమాజమార్పునకు తయారు చేసిన ఆయుధమే 'కమ్యూనిస్ట్​ మానిఫెస్టో'

ఇవీ చూడండి:రాజన్నకు పట్టువస్త్రాలు సమర్పించిన మంత్రి

ABOUT THE AUTHOR

...view details