'ఉద్యోగులు, జర్నలిస్టుల పథకంలోనూ అక్రమాలు' - there is another scam in esi that is ejhs scheme
ఉద్యోగులు, జర్నలిస్టుల పథకంలో భాగంగా కొనుగోలు చేసిన ఔషధాల్లోనూ కుంభకోణం జరిగిందని సీపీఎం నేతలు అనిశాకు ఫిర్యాదు చేశారు.
ఈజేహెచ్ఎస్ స్కీమ్‌లో భాగంగా వెల్నెస్ సెంటర్లకు అవసరమైన మందుల కొనుగోళ్లలోనూ అక్రమాలు జరిగాయనివెల్నెస్, అప్పటి అరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్టు సీఈఓ ప్రస్తుతం ఈఎస్ఐ జేడీగా ఉన్న పద్మ గోల్మాల్ చేశారని సీపీఎం నేతలు అనిశాకు ఫిర్యాదు చేశారు. 2016-18 సంవత్సరాల్లో కె.పద్మ సుమారు రూ.20 కోట్ల ఔషధాలు కొనుగోలు చేశారని... అందులో నిబంధనలకు విరుద్ధంగా 17 ఫార్మా కంపెనీల నుంచి కొనుగోళ్లు జరిగాయని నగర కార్యదర్శి శ్రీనివాస్ లేఖలో పేర్కొన్నారు. ఆమెపై చర్యలు తీసుకోవాలని వైద్యఆరోగ్యశాఖకు నివేదిక ఇచ్చి 20నెలలు గడుస్తున్నా... ఎలాంటి చర్యలు తీసుకోలేదని మండిపడ్డారు. ఉద్యోగులు, జర్నలిస్టుల పథకంలో భాగంగా కొనుగోలు చేసిన ఔషధాల కుంభకోణంలోనూ అనిశా విచారణ చేపట్టాలని ఏసీబీ డీజీని శ్రీనివాస్ కోరారు.
- ఇదీ చూడండి : పోలీస్ అకాడమీలపై చేసే ఖర్చులు వృథా: వీకే సింగ్