భారీ వర్షాలకు బెంగళూరు జాతీయ రహదారి పైకి భారీగా వరద నీరు వచ్చి చేరింది. సైబరాబాద్ సీపీ సజ్జనార్ పరిస్థితిని సమీక్షించారు. గగన్పహడ్ వద్ద వరద నీటిని పరిశీలించారు.
బెంగళూరు హైవేపై వరద నీరు.. రాకపోకలు నిలిపివేత - వరద నీరు
భారీ వర్షానికి బెంగళూరు జాతీయ రహదారిపైకి భారీగా వరద నీరు వచ్చి చేరింది. పరిస్థితిని సమీక్షించిన సైబరాబాద్ సీపీ సజ్జనారు.. గగన్పహడ్ వద్ద జాతీయ రహదారిని పరిశీలించారు.
బెంగళూరు హైవేపై వరద నీరు.. రాకపోకలు నిలిపివేత
వరద నీరు భారీగా చేరుతుండటం వల్ల వాహనాల రాకపోకలు నిలిపేశారు. హైదరాబాద్ వైపు వచ్చే వాహనాలను, బెంగళూరు వైపు వెళ్లే వాహనాలు బాహ్యవలయ రహదారి మీదుగా వెళ్లాలని ట్రాఫిక్ పోలీసులు సూచిస్తూన్నారు. గగన్ పహాడ్ చెరువు, అప్పా చెరువు, పల్లె చెరువును సీపీ సజ్జనార్ పరిశీలించారు. అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు.
ఇదీ చూడండి:తెరాస నాయకుడిపై ట్విట్టర్లో ఫిర్యాదు.. స్పందించిన మంత్రి కేటీఆర్