ట్రాఫిక్ సిగ్నళ్ల వద్ద సమస్యలను సైబరాబాద్ సీపీ వీసీ సజ్జనార్, ట్రాఫిక్ డీసీపీ విజయ్ కుమార్‌తో కలిసి పరిశీలించారు. మాదాపూర్ ఆవాసా, సైబర్ టవర్స్, –హైటెక్స్, ఖానామెట్, కొత్తగూడ, కొండాపూర్ జంక్షన్లు సందర్శించి అక్కడి సమస్యలు తెలుసుకున్నారు. వాహనాల రద్దీకి గల కారణాలు, మలుపులు, వర్షం నీళ్లు నిలిచే ప్రాంతాలను పరిశీలించి సిబ్బందికి సూచనలు చేశారు. పలు జంక్షన్ల వద్ద సైన్ బోర్డులు ఏర్పాటు చేయాలన్నారు.
ట్రాఫిక్ సిగ్నల్స్ పరిశీలించిన సీపీ సజ్జనార్ - cp sajjanar
సైబరాబాద్‌లోని వివిధ ట్రాఫిక్ జంక్షన్లను సీపీ సజ్జనార్ పరిశీలించారు. సిగ్నళ్ల పనితీరు, సైన్ బోర్డుల ఏర్పాటుపై సిబ్బందికి సూచనలు చేశారు.
ట్రాఫిక్ సిగ్నల్స్ పరిశీలించిన సీపీ సజ్జనార్