హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్ ఆధ్వర్యంలో లంగర్ హౌస్‌లోని ఓ ప్రైవేట్ ఫంక్షన్హాల్లో సుమారు 250 మంది ఇతర రాష్ట్రాలకు చెందిన పేదవారికి నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు. కార్యక్రమానికి సహకరించి, విజయవంతం చేసిన దాతలందరికీ సీపీ ధన్యవాదాలు తెలిపారు.
అంతర్రాష్ట్ర పేదలకు నిత్యావసరాలు పంపిణీ - లాక్డౌన్
ఇతర రాష్ట్రాలకు చెందిన 250 మందికి సీపీ అంజనీకుమార్ నిత్యావసరాలను పంపిణీ చేశారు. లంగర్ హౌస్‌లో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి సహకరించిన దాతలకు సీపీ ధన్యవాదాలు తెలిపారుొ
అంతర్రాష్ట్ర పేదలకు నిత్యావసరాలు పంపిణి
రానున్న 20 రోజులు కూడా ప్రజలు లాక్‌డౌన్‌ను సహకరించాలని సీపీ కోరారు. ఇతర రాష్ట్రాలతో పోల్చుకుంటే రాష్ట్రంలో లాక్డౌన్ సమర్థవంతంగా అమలవుతోందన్నారు. ప్రజలంతా భౌతిక దూరం పాటిస్తూ, ప్రభుత్వ సూచనలకు అనుగుణంగా నడుచుకోవాలని విజ్ఞప్తి చేశారు.
ఇవీ చూడండి:24 గంటల్లో 35 మరణాలు, 796 కొత్త కేసులు