ఆర్టీసీ ఐకాస నాయకులు తలపెట్టిన ఛలో ట్యాంక్‌బండ్‌కు ఎలాంటి స్పందన లేదని నగర పోలీసు కమిషనర్ అంజనీ కుమార్ అన్నారు. ఆర్టీసీ యూనియన్ నాయకులను, వారికి మద్దతిస్తున్న ప్రజాసంఘాల నాయకులను ముందస్తు అరెస్టులు చేసినట్లు ఆయన తెలిపారు. ఇప్పటి వరకు హైదరాబాద్‌లో 170 మందిని అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించారు. హైదరాబాద్ కాస్మోపాలిటన్ నగరం కాబట్టి వారాంతాల్లో కూడా వ్యాపారం పెద్ద ఎత్తున జరుగుతుందని.. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకూడదన్నదే ప్రధాన ఉద్దేశమని ఆయన అన్నారు. అందుచేతనే ఛలో ట్యాంక్‌బండ్‌కు సమ్మతించలేదని సీపీ తెలిపారు.
ట్యాంక్ బండ్ ప్రశాంతంగా ఉంది: సీపీ అంజనీ కుమార్ - ట్యాంక్ బండ్ ప్రశాంతంగా ఉంది: సీపీ అంజనీ కుమార్
ఆర్టీసీ ఐకాస నాయకులు తలపెట్టిన ఛలో ట్యాంక్ బండ్ పిలుపు నేపథ్యంలో హైదరాబాద్‌లో 170 మందిని ముందస్తు అరెస్ట్ చేశారు. ట్యాంక్‌బండ్ వద్ద అంతా ప్రశాంతంగా ఉందని నగర పోలీసు కమిషనర్ అంజనీ కుమార్ తెలిపారు.
ట్యాంక్ బండ్ ప్రశాంతంగా ఉంది: సీపీ అంజనీ కుమార్