తెలంగాణ

telangana

ETV Bharat / city

పోలీసు ఉద్యోగుల కుటుంబాల వివరాలు సిద్ధం చేయండి: సీపీ

హైదరాబాద్​లోని స్టేషన్‌ అధికారులు, ఏసీపీలు, డీసీపీలతో హైదరాబాద్‌ నగర పోలీసు కమిషనర్‌ అంజనీకుమార్​... వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. పోలీసు సిబ్బంది కుటుంబసభ్యులకు సంబంధించి... ఆధార్‌కార్డులతో కూడిన వివరాలు సేకరించాలని సీపీ సూచించారు.

cp anjani kumar video conference about vaccination to police families
cp anjani kumar video conference about vaccination to police families

By

Published : Apr 27, 2021, 7:24 PM IST

Updated : Apr 27, 2021, 10:25 PM IST

వచ్చే నెల ఒకటో తేదీ నుంచి 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరు వ్యాక్సిన్​ వేయించేందుకు వీలుగా... పోలీసు ఉద్యోగుల కుంటుంబాల వివరాలు సిద్ధం చేయాలని నగర పోలీసు కమిషనర్‌ అంజనీకుమార్‌ ఆదేశించారు. నగరంలోని స్టేషన్‌ అధికారులు, ఏసీపీలు, డీసీపీలతో హైదరాబాద్‌ నగర పోలీసు కమిషనర్‌ వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. సమావేశంలో నేర విభాగం అదనపు సీపీ షీఖాగోయల్‌, అదనపు సీపీలు అనిల్‌కుమార్‌, చౌహాన్‌, స్పెషల్‌ బ్రాంచి తదితర విభాగాలకు చెందిన అధికారులు పాల్గొన్నారు.

పోలీసు సిబ్బంది కుటుంబసభ్యులకు సంబంధించి... ఆధార్‌కార్డులతో కూడిన వివరాలు సేకరించాలని సూచించారు. కరోనా పాజిటివ్‌ వచ్చి బాధపడుతున్న పోలీసులకు అందుబాటులో ఉండేందుకు ప్రతి ఏసీపీ, డీసీపీ ప్రత్యేకంగా వాట్సప్‌ గ్రూపు ఏర్పాటు చేసుకోవాలని స్పష్టం చేశారు. కమ్యూనిటీ సీసీటీవీల పని తీరుపై సంబంధిత అధికారులు పర్యవేక్షించాలన్న సీపీ... 2018 నుంచి రౌడీలు, చైన్‌ స్నాచింగ్‌ కేసులతో పాటు ప్రస్తుత కార్యకలాపాలను పర్యవేక్షించాలని ఆదేశించారు.

ఇదీ చూడండి: రాష్ట్రంలో ఆక్సిజన్‌ కొరత లేదన్న మంత్రి ఈటల రాజేందర్​

Last Updated : Apr 27, 2021, 10:25 PM IST

ABOUT THE AUTHOR

...view details