తెలంగాణ

telangana

ETV Bharat / city

Lockdown: 99 శాతం మంది.. పోలీసులకు సహకరిస్తున్నారు: సీపీ - నగర పోలీసు కమిషనర్‌ అంజనీకుమార్‌

జంటనగరాల్లో లాక్‌డౌన్‌ సమర్ధవంతంగా అమలవుతోందని నగర పోలీసు కమిషనర్‌ అంజనీకుమార్‌ తెలిపారు. 99 శాతం మంది.. కొవిడ్ నిబంధనలు పాటిస్తూ పోలీసులకు సహకరిస్తున్నారని అన్నారు. నియమాలను అతిక్రమించిన ఆ ఒక్క శాతం మందిపై కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన తెలిపారు. మెహదీపట్నం రైతుబజార్‌ చెక్‌పోస్టు వద్ద లాక్‌డౌన్‌ అమలు తీరును సీపీ పరిశీలించారు.

cp anjani kumar
జంటనగరాల్లో లాక్‌డౌన్‌

By

Published : May 28, 2021, 3:15 PM IST

జంటనగరాల్లో.. కరోనా నిబంధనలు ( covid rules) పాటించని వారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నామని నగర పోలీసు కమిషనర్‌ అంజనీకుమార్‌ (cp anjani kumar) పేర్కొన్నారు. లాక్​డౌన్​ సమయంలో.. ప్రతి రోజు 8 నుంచి 9 వేల కేసులు నమోదు చేస్తున్నట్లు తెలిపారు. 6 నుంచి 7 వేల వాహనాలను జప్తు (vehicle seize) చేస్తున్నట్లు వివరించారు. మెహదీపట్నం రైతుబజార్‌ చెక్‌పోస్టు వద్ద లాక్‌డౌన్‌ అమలు తీరును సీపీ పరిశీలించారు.

నగరంలో.. 99 శాతం మంది లాక్​డౌన్​ నిబంధనలు పాటిస్తూ పోలీసులకు సహకరిస్తున్నారని సీపీ తెలిపారు. నియమాలను అతిక్రమించిన ఆ ఒక్క శాతం మందిపై కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన తెలిపారు. సడలింపు సమయంలో.. ప్రతి ఒక్కరు భౌతిక దూరం పాటిస్తూ విధిగా మాస్కులు ధరిస్తున్నారని చెప్పారు. రిపిల్స్‌ కైండ్‌నెస్‌ సంస్థ ఆధ్వర్యంలో.. పోలీసు సిబ్బందికి ఆక్సిజన్‌ కాన్స్‌న్‌ట్రేటర్లు, మాస్కులను ఆయన పంపిణీ చేశారు.

ఇదీ చదవండి:Lockdown: 5 నిమిషాలు లేటయినందుకు 1000 ఫైన్​.. యువకుడు హల్​చల్​

ABOUT THE AUTHOR

...view details