"తెలంగాణ విద్యార్థి వేదిక... మావోయిస్టులకు సహకరిస్తోంది" - cp anjani kumar about maoist activities in hyderabad
తెలంగాణ విద్యార్థి వేదిక మావోయిస్టులకు మద్దతుగా వ్యవహరిస్తోందని హైదరాబాద్ సీపీ అంజనీకుమార్ అన్నారు. ఇటీవల తెవివి నాయకుల ఇళ్లలో జరిపిన సోదాల్లో పలు ఆధారాలు లభించాయని తెలిపారు.
మావోయిస్టులకు తెలంగాణ విద్యార్థి వేదిక మద్దతు
మావోయిస్టు అనుబంధ సంస్థలకు మద్దతుగా తెలంగాణ విద్యార్థి వేదిక వ్యవహరిస్తోందని హైదరాబాద్ సీపీ అంజనీకుమార్ తెలిపారు. విద్యార్థులను లక్ష్యం చేసుకుని కార్యకలాపాలు కొనసాగిస్తున్నారని చెప్పారు. ఇటీవలి తెవివి నాయకుల ఇళ్లలో జరిపిన సోదాల్లో పలు ఆధారాలు లభించాయని వెల్లడించారు. వీరిపై నల్లకుంట పోలీస్ స్టేషన్లో కేసులు నమోదు చేసి సిట్ వేశామన్నారు. ఇటువంటి విద్యార్థి సంఘాల పట్ల ఆకర్షితులు కావొద్దని విద్యార్థులకు సూచించారు.
- ఇదీ చూడండి : హైదరాబాద్లో పలుచోట్ల వర్షం... ట్రాఫిక్కు అంతరాయం