ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు జిల్లా ఆదోని టిడ్కో గృహాల్లో ఏర్పాటు చేసిన కొవిడ్ కేర్ సెంటర్ వద్ద దారుణ పరిస్థితి నెలకొంది. కేంద్రంలో వైరస్ బాధితులు 600 మంది దాకా ఉన్నారు. ఇక్కడ ఓ వాహనంలో వైద్యులు వచ్చి పరీక్షలు చేసి మందులు అందించి వెళ్తున్నారు. తద్వారా రోగులందరు గదుల నుంచి బయట గంటల తరబడి ఎండా, వానలకు వరుసలో నిల్చుని సేవలు పొందాల్సి వస్తోంది.
వైద్యం కోసం బారులు తీరిన కరోనా బాధితులు - corona patients
ఏపీలోని కర్నూలు జిల్లా ఆదోని టిడ్కో గృహాల్లో ఏర్పాటు చేసిన కొవిడ్ కేర్ సెంటర్లో కరోనా రోగులు ఇబ్బంది పడుతున్నారు. వైద్యం కోసం గంటల తరబడి వరుసలో నిల్చోవాల్సి వస్తోందని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
వైద్యం కోసం బారులు తీరిన కరోనా బాధితులు
వృద్ధులు, దివ్యాంగులు నిలబడలేక చాలా ఇబ్బంది పడుతున్నారు. తమని హోమ్ క్వారంటైన్లో ఉంటామంటే అనుమతి ఇవ్వకుండా.. కొవిడ్ సెంటర్కు తీసుకొచ్చి కుంగదీసేలా చేస్తున్నారని వైరస్ బాధితులు ఆవేదన చెందుతున్నారు. అధికారులు స్పందించి వసతులు కల్పించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు.
ఇదీ చదవండి:పీవీకి భారతరత్న ఇవ్వాలని అసెంబ్లీలో తీర్మానం చేస్తాం: సీఎం