తెలంగాణలో మరోసారి కరోనా విజృంభించే అవకాశముందని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. ప్రజలంతా కొవిడ్ నిబంధనలు పాటిస్తూ వైరస్ బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. రాష్ట్రంలో తాజాగా మరో 216 కరోనా కేసులు నమోదయ్యాయి. మహమ్మారి బారిన పడి ఇద్దరు మరణించారు.
రాష్ట్రంలో మరో 216 కరోనా కేసులు, 2 మరణాలు - telangana covid news
రాష్ట్రంలో కరోనా కేసులు నెమ్మదిగా పెరుగుతున్నాయి. తాజాగా మరో 216 కొవిడ్ కేసులు నమోదవ్వగా.. వైరస్ బారిన పడి ఇద్దరు మృతి చెందారు.
రాష్ట్రంలో మరో 216 కరోనా కేసులు, 2 మరణాలు
రాష్ట్రంలో ప్రస్తుతం 1,918 కరోనా యాక్టివ్ కేసులున్నాయి. ప్రస్తుతం 749 మంది బాధితులు హోం ఐసోలేషన్లో ఉన్నారు. జీహెచ్ఎంసీ పరిధిలో మరో 52 కేసులు నమోదయ్యాయి.
- ఇదీ చూడండి :పెరుగుతున్న వలసలు.. కరోనా జాడలు