తెలంగాణ

telangana

ETV Bharat / city

ap corona cases: ఏపీలో కొత్తగా 1,115 మందికి కొవిడ్​ పాజిటివ్‌ - corona deaths in ap

ఆంధ్రప్రదేశ్​లో కొత్తగా 1,115 మందికి కరోనా సోకింది. తాజాగా 19మంది కరోనా మహమ్మారికి బలవ్వగా.. మొత్తం మృతుల సంఖ్య 13,857కి పెరిగింది. ఈ మేరకు ఆ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ బులిటెన్‌ విడుదల చేసింది.

ap corona cases
ఏపీ కరోనా కేసులు

By

Published : Aug 31, 2021, 9:11 PM IST

ఏపీలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో 52,319 నమూనాలను పరీక్షించగా 1,115 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 20,14,116కి చేరింది. తాజాగా 19మంది కరోనా మహమ్మారికి బలవ్వగా.. మొత్తం మృతుల సంఖ్య 13,857కి పెరిగింది. మరో వైపు 1,265 మంది కరోనా నుంచి కోలుకొని డిశ్ఛార్జి కాగా.. ఆ రాష్ట్రంలో ప్రస్తుతం 14,693 క్రియాశీల కేసులు ఉన్నట్లు ప్రభుత్వం వెల్లడించింది.

ఈ మేరకు ఆ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ బులిటెన్‌ విడుదల చేసింది. ఏపీ వ్యాప్తంగా ఇప్పటి వరకు 2,66,29,314 నమూనాలను పరీక్షించినట్లు అందులో పేర్కొంది. తాజాగా చిత్తూరు, కృష్ణా జిల్లాల్లో నలుగురు, నెల్లూరులో ముగ్గురు, గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో ఇద్దరు, తూర్పుగోదావరి, శ్రీకాకుళం, విశాఖపట్నం, పశ్చిమగోదావరి జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున ప్రాణాలు కోల్పోయారు.

ఏపీ కరోనా కేసులు

ఇదీ చదవండి:tollywood drug case: బండ్ల గణేశ్‌ నుంచి గంటపాటు వివరాలు సేకరించిన ఈడీ

ABOUT THE AUTHOR

...view details