తెలంగాణలో మరో కరోనా కేసు: మంత్రి ఈటల - Live Coronavirus updates
17:23 March 17
తెలంగాణలో మరో కరోనా కేసు: మంత్రి ఈటల
తెలంగాణలో మరో కరోనా పాజిటివ్ కేసు నమోదైనట్టు రాష్ట్ర ఆరోగ్య శాఖమంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. రాష్ట్రంలో ఇప్పటివరకూ ఐదుగురికి వ్యాధి సోకగా, ఒకరు డిశ్చార్జి అయ్యారని చెప్పారు.
కరోనాకు సంబంధించి రాతపూర్వక బులెటిన్లు విడుదల చేస్తామని మంత్రి ఈటల చెప్పారు. ఇప్పటివరకూ తెలంగాణలో ఏ ఒక్కరికీ కరోనా సోకలేదని తెలిపారు. విదేశాల నుంచి వచ్చిన ఐదుగురికి పాజిటివ్ ఉన్నట్లు గుర్తించామని పేర్కొన్నారు. దుబాయ్, ఇటలీ, నెదర్లాండ్, స్కాట్లాండ్, ఇండోనేషియా నుంచి వచ్చిన వ్యక్తులకు పాజిటివ్ ఉందని తెలిపారు.
పలు దేశాల నుంచి వచ్చే వ్యక్తులకు విమానాశ్రయంలో స్క్రీనింగ్ చేస్తున్నామని చెప్పారు. కరోనా లక్షణాలు ఉన్న వ్యక్తులకు గాంధీ ఆస్పత్రిలో చికిత్స చేస్తున్నామని తెలిపారు. కరోనా లక్షణాలు లేనివారిని క్వారంటైన్‌లో ఉంచేందుకు ఏర్పాట్లు చేశామన్నారు. దూలపల్లి, వికారాబాద్‌లో 14 రోజులు క్వారంటైన్‌లో ఉంటుతున్నట్టు పేర్కొన్నారు. దాదాపు 200 మందికి పైగా క్వారంటైన్‌లో ఉంచామని చెప్పారు.