తెలంగాణ

telangana

ETV Bharat / city

రాష్ట్రంపై కరోనా పంజా.. సూర్యాపేటలో ఆందోళనకరం

రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 928కి చేరింది. మంగళవారం ఒక్కరోజే రాష్ట్రంలో 56 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీటిలో అత్యధికంగా 26 కేసులు నమోదైన సూర్యాపేట జిల్లాలో కలవరం పుట్టిస్తోంది. మరో 19 కేసులు జీహెచ్​ఎంసీ పరిధిలో నమోదయ్యాయి. మంగళవారం 8 మంది ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయినట్టు వైద్య, ఆరోగ్య శాఖ పేర్కొంది.

corona cases increase in telangana governament take precautions
వేగంగా పెరుగుతున్న కరోనా పాజిటివ్ కేసులు

By

Published : Apr 22, 2020, 5:29 AM IST

Updated : Apr 22, 2020, 10:29 AM IST

రాష్ట్రంలో కరోనా కేసులు శరవేగంగా పెరుగుతున్నాయి. రెండు, మూడు రోజుల్లోనే కరోనా సోకిన వారి సంఖ్య వెయ్యి దాటే సూచనలు కనిపిస్తున్నాయి. మంగళవారం ఒక్కరోజే 56 కరోనా కేసులు నమోదయ్యాయి. కొన్ని రోజులుగా అత్యధికంగా జీహెచ్​ఎంసీ పరిధిలోనే నమోదవుతున్నాయి. అందుకు భిన్నంగా మంగళవారం నాడు 26 కేసులు సూర్యాపేట జిల్లాలో, మరో 19 కేసులు జీహెచ్​ఎంసీ పరిధిలో నమోదైనట్టు వైద్య, ఆరోగ్య శాఖ స్పష్టం చేసింది.

కంటైన్మెంట్ ప్రాంతాల్లో కట్టుదిట్టం

సూర్యాపేటలో ఇటీవల కేసులు వేగంగా పెరుగుతున్నాయి. ఇప్పటి వరకు 80 మందికి కరోనా సోకినట్టు ప్రభుత్వ లెక్కలు చెబుతున్నాయి. ఇక ఉమ్మడి నల్గొండ జిల్లాలో సుమారు 90కి పైగా కేసులు నమోదుకావటం ఆందోళనకరంగా మారింది. దీంతో ప్రభుత్వం ఉమ్మడి నల్గొండ జిల్లాలోని కంటైన్మెంట్ ప్రాంతాల్లో మరింత కట్టుదిట్టమైన చర్యలు చేపట్టింది.

194 మంది డిశ్చార్జ్..

నిజామాబాద్‌ జిల్లాలో 3, ఆదిలాబాద్‌, గద్వాల జిల్లాల్లో రెండు, ఖమ్మం, మేడ్చల్, వరంగల్ పట్టణ, రంగారెడ్డి జిల్లాల్లో ఒక్కో కేసు చొప్పున నమోదయ్యాయి. రాష్ట్రంవ్యాప్తంగా 8 మంది కరోనా నుంచి కోలుకుని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ కాగా... ఇప్పటి వరకు 194 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో కరోనా మహమ్మారితో 23మంది చనిపోయారు. కోలుకున్న వారు, మృతులు మినహా 711 మంది చికిత్స పొందుతున్నట్టు వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది.

వైద్యులను సంప్రదించాల్సిందే..

కరోనా తీవ్రత అధికంగా ఉన్న జిల్లాల్లో నివారణ చర్యల కోసం ప్రభుత్వం ప్రత్యేక అధికారులను నియమించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్య ఆరోగ్యశాఖ సూచిస్తోంది. జలుబు, దగ్గు, జ్వరం వంటి లక్షణాలు ఉంటే తప్పక వైద్యులను సంప్రదించాలని కోరుతోంది. అత్యవసరమైతే తప్ప ఎట్టి పరిస్థితుల్లోనూ ఇంటి నుంచి బయటకు రావద్దని విజ్ఞప్తి చేస్తోంది.

Last Updated : Apr 22, 2020, 10:29 AM IST

ABOUT THE AUTHOR

...view details