రాష్ట్రంలో 2 వేలు దాటిన రోజువారీ కరోనా కేసులు
09:52 April 08
13 వేలు దాటిన కరోనా క్రియాశీల కేసులు
రాష్ట్రంలో కరోనా కోరలు చాస్తోంది. రెండో దశలో కేసులు రెండువేల మార్కును దాటాయి. గడిచిన 24 గంటల్లో 87,332 మందికి కరోనా పరీక్షలు చేయగా... 2055 మంది మహమ్మారి భారిన పడినట్టు వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. ఇప్పటి వరకు వైరస్ సోకిన వారి సంఖ్య 318704కి పెరిగింది. మరో 303 మంది కోలుకోగా.... మొత్తంగా కరోనా నుంచి కరోనాను జయించినవారి సంఖ్య 303601కు చేరింది. ఏడుగులు మృతి చెందగా ... కరోనా మరణాలు 303601కి పెరిగాయి.
తాజాగా వచ్చిన కేసులు కలుపుకుని 13362 యాక్టివ్ కేసులు ఉండగా... అందులో 8263మంది హోం ఐసోలేషన్లో ఉన్నారు. మహమ్మారి బారిన పడుతున్న వారిలో 10.5 శాతం మంది పది నుంచి 20 ఏళ్లలోపు వారే ఉంటున్నట్టు ఆరోగ్య శాఖ గణాంకాలు చెబుతున్నాయి. జీహెచ్‌ఎంసీ పరిధిలో మరో 398 కరోనా కేసులు నమోదయ్యాయి. కాగా... రేపట్నుంచి సాయంత్రం ఐదు గంటలకు బేగం బజార్ మూసేయనున్నట్లు అధికారులు ప్రకటించారు.
తాజాగా కేసులు జిల్లాల వారీగా....
ఆదిలాబాద్ లో 24, భద్రాద్రి కొత్తగూడెంలో 10, జీహెచ్ఎంసీలో 398, జగిత్యాల 99, జనగామ 18, జయశంకర్ భూపాలపల్లి 12, జోగులాంబ గద్వాల 8, కామారెడ్డి 58, కరీంనగర్ 77, ఖమ్మం 50, కొమరంభీం ఆసిఫాబాద్ 41, మహబూబ్ నగర్ 60, మహబూబాబాద్ 8, మంచిర్యాల 57, మెదక్ 19, మేడ్చల్ మల్కాజ్ గిరి 214, ములుగు 3, నాగర్ కర్నూల్ 25, నల్గొండ 54, నారాయణపేట 7, నిర్మల్ 100, నిజామాబాద్ 169, పెద్దపల్లి 33, రాజన్న సిరిసిల్ల 36, రంగారెడ్డి 174, సంగారెడ్డి 65, సిద్దిపేట 35, సూర్యాపేట 34, వికారాబాద్ 38, వనపర్తి 21, వరంగల్ రూరల్ 11, వరంగల్ అర్బన్ 74, యాదాద్రి భువనగిరిలో 23 చొప్పున కరోనా కేసులు నమోదయ్యాయి.