CORONA CASES IN MEDICAL COLLEGE: కర్నూలు మెడికల్ కాలేజీలో కరోనా కలకలం.. - CORONA
12:56 January 10
CORONA CASES IN MEDICAL COLLEGE: కర్నూలు మెడికల్ కాలేజీలో కరోనా కలకలం..
ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లాలో కరోనా ప్రమాద ఘంటికలు మోగుతున్నాయి. గత వారం రోజులుగా కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. శనివారం 23 కేసులు నమోదుకాగా.. ఆదివారం 29 మందికి వైరస్ సోకింది. కర్నూలు వైద్య కళాశాల వసతి గృహంలో ఉంటున్న 11 మంది విద్యార్థులకు కొవిడ్ సోకింది. వీరికి వైద్యం అందిస్తున్నారు. కేసులు పెరుగుతున్నా.. పరీక్షలు మాత్రం కానరావడం లేదు.
నేటి నుంచి ప్రికాషనరీ డోసు..
ఇదిలా ఉండగా.. జిల్లావ్యాప్తంగా హెల్త్‌కేర్ వర్కర్లు, ఫ్రంట్‌లైన్ వర్కర్లు, 60 ఏళ్లు దాటినవారికి నేటి నుంచి ప్రికాషనరీ డోసు టీకాలు వేయనున్నట్లు డీఎంహెచ్‌వో డాక్టర్ రామగిడ్డయ్య ఆదివారం తెలిపారు. కొవిడ్ టీకాలు రెండు డోసులు వేసుకుని 9 నెలలు పూర్తైనవారికి వేస్తామని చెప్పారు. గతంలో ఏ వ్యాక్సిన్ వేసుకుంటే అదే వేయనున్నట్లు పేర్కొన్నారు. జిల్లాలోని పీహెచ్‌సీలు, అర్బన్ ఆరోగ్య కేంద్రాల్లో టీకాలు వేస్తారన్నారు.
TAGGED:
CORONA