ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గంలో కరోనా విజృంభిస్తోంది. మంగళగవారం మంగళగిరిలో 7, మంగళగిరి మండలంలో 1, తాడేపల్లి మండలంలో రెండు కేసులు నమోదయ్యాయి. మంగళగిరిలో వచ్చిన 7 కేసుల్లో ఆరుగురు పోలీసులుండటం ఒక్క సారిగా కలవారనికి గురిచేసింది. ఇందులో మంగళగిరి ఆరో బెటాలియన్ లో పనిచేసే ఐదుగురు, డీజీపీ కార్యాలయంలో పనిచేసే ఓ కానిస్టేబుల్ కు వచ్చినట్లు అధికారులు ధ్రువీకరించారు.
డీజీపీ ఆఫీస్లో పని చేసే కానిస్టేబుల్కు కరోనా... మంగళగిరిలో కలవరం... - corona cases at mangalagiri
ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గంలో కరోనా కలకలం రేపుతోంది. మంగళగిరిలో ఒక్కరోజే 7 కేసులు నమోదయ్యాయి. వారిలో ఆరుగురు పోలీసులుండటం కలవరపెడుతోంది.
డీజీపీ ఆఫీస్లో పని చేసే కానిస్టేబుల్కు కరోనా... మంగళగిరిలో కలవరం...
మంగళగిరి పోలీస్ స్టేషన్ లో పనిచేసే మహిళా కానిస్టేబుల్ భర్తకు కరోనా సోకడంతో అందులో పనిచేసే వారంతా మంగళవారం పరీక్షలు చేయించుకున్నారు. కొప్పురావూరు కాలనీలో మరో వ్యక్తికి సోకడంతో ఆ ప్రాంతంలో సుమారు వంద మందికి అధికారులు కరోనా పరీక్షలు నిర్వహించారు
ఇదీ చదవండి: రూ.2.24లక్షల కోట్లతో బడ్జెట్ ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి బుగ్గన