రాచకొండ పోలీసు కమిషనరేట్ పరిధిలో కొవిడ్ పాజిటివ్ కేసులు తగ్గుతున్నాయని, ప్రభుత్వం చేపట్టిన లాక్‌డౌన్‌తో సత్ఫలితాలు వస్తున్నాయని పోలీసు కమిషనర్ మహేశ్‌భగవత్ అన్నారు. లాక్‌డౌన్ అమలు చేస్తుండటంతో పాటు నిరంతరం పర్యవేక్షిస్తున్నట్లు చెప్పారు. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా ఘట్‌కేసర్ పోలీసు స్టేషన్ పరిధిలోని వరంగల్ జాతీయ రహదారి, పోలీసు చెక్‌పోస్టులను తనిఖీ చేశారు.
CP Mahesh Bhagawath : లాక్‌డౌన్‌తో కరోనా తగ్గుముఖం - rachakonda cp mahesh bhagawath
రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో కొవిడ్ పాజిటివ్ కేసులు తగ్గుతున్నాయని సీపీ మహేశ్ భగవత్ తెలిపారు. ప్రభుత్వం చేపట్టిన లాక్‌డౌన్‌తో సత్ఫలితాలు వస్తున్నాయని చెప్పారు.
తెలంగాణ వార్తలు, తెలంగాణలో లాక్‌డౌన్, తెలంగాణలో లాక్‌డౌన్ 2021
లాక్‌డౌన్ నిబంధనలను పాటించనివారిపై రోజుకు 4వేల కేసులు నమోదు చేస్తున్నట్లు సీపీ పేర్కొన్నారు. నిబంధనలను ప్రతి ఒక్కరు పాటించాలని సూచించారు. రోజుకు వెయ్యి నుంచి 1500 వరకు వాహనాలు సీజ్ చేస్తున్నట్లు తెలిపారు. ప్రజలంతా లాక్‌డౌన్‌కు సహకరించి ఇంట్లోనే ఉండాలని కోరారు.