తెలంగాణలో మరో 194 కరోనా కేసులు నమోదయ్యాయి. మహమ్మారి బారిన పడి ముగ్గురు మృతి చెందారు. వైరస్ నుంచి మరో 116 మంది బాధితులు కోలుకున్నారు.
రాష్ట్రంలో మరో 194 కరోనా కేసులు, 3 మరణాలు - తెలంగాణ కొవిడ్ న్యూస్
తెలంగాణలో కరోనా తగ్గుముఖం పట్టింది. ప్రజలంతా కొవిడ్ నిబంధనలు పాటించడం వల్ల కేసులు చాలావరకు తగ్గాయని రాష్ట్ర వైద్యఆరోగ్య శాఖ వెల్లడించింది. తాజాగా 194 మంది మహమ్మారి బారిన పడ్డారు.
తెలంగాణ కరోనా కేసులు
రాష్ట్రంలో ప్రస్తుతం 1,855 కరోనా యాక్టివ్ కేసులున్నాయి. ప్రస్తుతం 730 మంది బాధితులు హోంఐసోలేషన్లో ఉన్నారు. జీహెచ్ఎంసీ పరిధిలో మరో 35 కరోనా కేసులు నమోదయ్యాయి.
- ఇదీ చూడండి :దేశవ్యాప్తంగా మరో 22,854మందికి కరోనా