తెలంగాణ

telangana

ETV Bharat / city

ఖాతాదారులకు గమనిక: బ్యాంకులకు వరుస సెలవులు - బ్యాంకులకు వరుస సెలవులు

రెండో, నాలుగో శనివారాలు, ఆదివారాలు, పండుగలంటూ బ్యాంకులకు వరుస సెలవులున్నట్లు ఉన్నతాధికారులు తెలిపారు. ఈ విషయాన్ని గమనించి ఖాతాదారులు తమ బ్యాంకు పనులు చూసుకోవాలని సూచించారు. బ్యాంకు పనిదినాలు, సెలవు దినాలు ఇలా ఉన్నాయి...

http://10.10.50.85:6060///finalout4/telangana-nle/finalout/25-March-2021/11152415_bank-final.png
బ్యాంకులకు వరుస సెలవులు

By

Published : Mar 25, 2021, 2:18 PM IST

Updated : Mar 25, 2021, 3:11 PM IST

ప్రభుత్వ రంగ బ్యాంకులకు వరుస సెలవులు ఉన్నట్లు ఉన్నతాధికారులు తెలిపారు. ఈ విషయాన్ని ఖాతాదారులు గమనించాలని సూచించారు. తమ అవసరాలకు ఇబ్బందులు కలగకుండా చూసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఆదివారాలు, పండుగ పర్వదినాలు కాకుండా ప్రతి నెలా రెండు, నాలుగు శనివారాలు బ్యాంకులకు సెలవులు రాగా... ఏప్రిల్​ 14 వరకు సుమారు 10 రోజులు మాత్రమే బ్యాంకులు పనిచేయనున్నాయి.

బ్యాంకులకు వరుస సెలవులు

ఈ నెల 27న నాలుగో శనివారం, 28 ఆదివారం, 29 హోలీ పర్వదినం ఈ మూడు రోజులు బ్యాంకులు పనిచేయవని బ్యాంకు అధికారులు తెలిపారు. ఈ నెల 30, 31 రెండు రోజులు బ్యాంకులు పనిచేస్తాయని పేర్కొన్నారు. ఏప్రిల్ 1న బ్యాంకులు పని చేసినప్పటికీ ఖాతాదారుల లావాదేవీలు కొనసాగవని తెలిపారు. ఏప్రిల్ 2న గుడ్​ఫ్రైడే కారణంగా బ్యాంకులు పని చేయవన్నారు. ఏప్రిల్ 3న ఒక్క రోజు బ్యాంకులు పనిచేస్తాయి. 4న ఆదివారం, 5న బాబు జగ్జీవన్ రావ్ జయంతి రెండు రోజులు సెలవులు. 6, 7, 8, 9 నాలుగు రోజులు బ్యాంకులు పనిచేస్తాయని తెలిపారు. 10న రెండో శనివారం, 11న ఆదివారం ఈ రెండు రోజులు బ్యాంకులకు సెలవులని పేర్కొన్నారు.

ఇదీ చూడండి: అప్పులకు బలైన రైతు కుటుంబం.. పరువు కోసం బలవన్మరణం

Last Updated : Mar 25, 2021, 3:11 PM IST

ABOUT THE AUTHOR

...view details