బలహీన వర్గాలపై రాష్ట్ర ప్రభుత్వం వివక్ష చూపుతోందని, రాజ్యాంగం కల్పించిన హక్కులను కుదించిందని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి ఆరోపించారు. మున్సిపల్ చట్టంపై ప్రభుత్వం ఆర్భాటాలు మాత్రమే కనిపిస్తున్నాయన్న ఆయన... అన్ని వర్గాలను కలుపుకుని రిజర్వేషన్లు యాభై శాతానికి మించకూడదని సుప్రీంకోర్టు తీర్పు స్పష్టం చేస్తోందన్నారు. బలహీన వర్గాలకు దక్కాల్సిన 13 స్థానాలను అన్‌రిజర్వ్ చేసి వాళ్లకు దక్కకుండా చేశారని ఆరోపించారు. ముఖ్యమంత్రి కేసీఆర్, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ సభలో అబద్ధాలు ఆడుతూ ప్రజలను మోసం చేస్తున్నారని, సభలో అబద్ధాలు ఆడితే సభా హక్కుల ఉల్లంఘన కిందికి వస్తుందని జీవన్‌రెడ్డి ఆరోపించారు. 2016లో అమలు చేసిన రిజర్వేషన్ ప్రక్రియ ఆ ఒక్కసారికి మాత్రమే వర్తిస్తుందని, ఇప్పుడు కూడా అవే ఉండాలని ఏమీ లేదని, ఒకవేళ ప్రభుత్వం అదే చేస్తే చట్టపరంగా అది నిలబడదన్నారు.
బలహీన వర్గాలపై ప్రభుత్వం వివక్ష చూపుతోంది: ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి - jeevan reddy spoke on cm kcr
సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ సభలో అబద్దాలు ఆడుతూ ప్రజలను మోసం చేస్తున్నారని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి ఆరోపించారు. బలహీన వర్గాలపై రాష్ట్ర ప్రభుత్వ వివక్ష చూపుతోందని... వారికి దక్కాల్సిన 13స్థానాలను అన్ రిజర్వ్ చేసి వాళ్లకు దక్కకుండా చేశారని మండిపడ్డారు.
సీఎం కేసీఆర్ తన అహంకారపూరిత ఆలోచనను అమలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. దేశం అంతా ఒకవైపు నడుస్తుంటే.. ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రం మరోవైపు వెళ్తున్నారని మండిపడ్డారు. బలహీన వర్గాలకు 42శాతం రిజర్వేషన్లు కల్పించే అవకాశం ఉన్నా ముఖ్యమంత్రి కల్పించడం లేదని ఆరోపించారు. తెరాస ప్రభుత్వం తెస్తున్న మున్సిపల్ రిజర్వేషన్లపై న్యాయపోరాటం చేయాలని పీసీసీ చీఫ్‌ను కోరతానని తెలిపారు. ముఖ్యమంత్రి అవసరమైతే దేవునితో అయినా పోరాటం చేస్తా అన్నారని... కానీ బలహీన వర్గాల రిజర్వేషన్లు లాక్కునే హక్కు ఆ దేవునికి కూడా లేదని ఆయన స్పష్టం చేశారు.
ఇవీ చూడండి: నష్టపోయిన వారిని ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకోవాలి: ఉత్తమ్