Rajagopal Reddy: ఆగస్టు 10వ తేదీ తర్వాత ఎప్పుడైనా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసే అవకాశాలున్నాయి. మునుగోడు నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.. భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, మాజీ ఎంపి వివేక్‌తో సంప్రదింపులు జరిపారు. భాజపా వర్గాల సమాచారం ప్రకారం రాత్రి ఫోన్లో సంప్రదింపులు జరిపారు. మరో మూడు రోజుల్లో ఈ నేతలు మరోసారి దిల్లీకి వెళ్లనున్నారు. ప్రస్తుత రాజకీయ పరిణామాలు మునుగోడు ఉప ఎన్నికలకు తెరలేపనున్నాయి.
భాజపా నాయకులతో రాజగోపాల్‌రెడ్డి సంప్రదింపులు... అనివార్యం కానున్న ఉపఎన్నిక - రాజగోపాల్‌రెడ్డి తాజా వార్తలు
Rajagopal Reddy: గత రెండు రోజుల నుంచి మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి భాజపాలో చేరనున్నారనే వార్త రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమవుతుంది. ఈ నేపథ్యంలో కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి.. భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, మాజీ ఎంపి వివేక్‌తో సంప్రదింపులు జరపడం మరింత ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ క్రమంలో ఆగస్టు 10 తర్వాత ఎప్పుడైనా రాజగోపాల్‌రెడ్డి కాంగ్రెస్‌ను వీడే అంశంపై నిర్ణయం ప్రకటిస్తారని భావిస్తున్నారు.
Rajagopal Reddy