'అధికారాలన్ని కలెక్టర్లకు అప్పగించడం సరికాదు' - శాసనసభ 2019
నూతన పురపాలక చట్టం విషయంలో కొన్ని అంశాలతో ఏకీభవించిన కాంగ్రెస్ పార్టీ పలు అంశాల్లో మార్పులను సూచించింది. పూర్తిగా కలెక్టర్లకు అధికారాలను అప్పగించే అంశాన్ని వ్యతిరేకించింది.
స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలిచిన అభ్యర్థుల అధికారాలను కలెక్టర్ల చేతిలో ఉంచడం సరికాదని కాంగ్రెస్ పక్ష నేత భట్టి విక్రమార్క అభిప్రాయపడ్డారు. ఈ నిర్ణయం గ్రామస్వరాజ్యాన్ని పూర్తిగా దెబ్బతీస్తుంందన్నారు. ప్రజల మద్దతుతో గెలిచి వచ్చిన అభ్యర్థులకే అధికారాలు అప్పగించడం సబబు అని తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు కల్పించాలని కోరామని వెల్లడించారు. సుప్రీం తీర్పుకు అనుగుణంగా రిజర్వేషన్ల అంశాన్ని పరిశీలించాలని కోరారు. అధికారాలు తప్పించడం అనేది ప్రజాప్రతినిధులే తప్పు చేస్తున్నారనే భావన కలిగిస్తోందన్నారు.
- ఇదీ చూడండి : పచ్చదనం లేకుంటే పదవుల నుంచి తొలగింపు