తెలంగాణ

telangana

ETV Bharat / city

Mallu Ravi Latest News: 'ఐదు రాష్ట్రాల ఫలితాలతో టీ-కాంగ్రెస్‌కు సంబంధం లేదు' - Mallu Ravi Latest News

Mallu Ravi Latest News: ఐదు రాష్ట్రాల ఫలితాలకు తెలంగాణ కాంగ్రెస్‌కు సంబంధం లేదని పీసీసీ సీనియర్ ఉపాధ్యక్షుడు మల్లు రవి స్పష్టం చేశారు. ఆ ప్రభావం రాష్ట్రంలో పార్టీపై పడదని తెలిపారు.

Mallu Ravi Latest News
Mallu Ravi Latest News

By

Published : Mar 10, 2022, 2:18 PM IST

Mallu Ravi Latest News : ఐదు రాష్ట్రాల ఫలితాలకు తెలంగాణలో జరగబోయే ఎన్నికలకు ఎలాంటి సంబంధం ఉండబోదని పీసీసీ సీనియర్‌ ఉపాధ్యక్షుడు మల్లు రవి వ్యాఖ్యానించారు. స్థానికంగా ఉండే అంశాలే రాష్ట్రాల ఎన్నికల్లో ప్రతిఫలిస్తాయన్నారు. ప్రజల గొంతుకై రాష్ట్రంలో పారాటం చేస్తామని తెలిపారు. అందులో భాగంగానే మన ఊరు - మన పోరు పేరుతో సభలు నిర్వహిస్తున్నామని చెప్పారు.

అందుకే ఈ సభ..

"కేసీఆర్ సర్కార్ ఇచ్చిన హామీలు నెరవేర్చలేదు. ఆ హామీలు అమలు చేయాలనే డిమాండ్‌తో మేం మన ఊరు మన పోరు అనే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. నిరుద్యోగ భృతి ఇస్తామని ఎప్పుడో చెప్పారు. ఇప్పటికీ ఇవ్వలేదు. ఉద్యోగాల నోటిఫికేషన్ గురించి ప్రకటన చేసినప్పుడు కూడా నిరుద్యోగ భృతి ఊసెత్తలేదు. కొల్లాపూర్ నియోజకవర్గంలోని గ్రామాల్లో ఉన్న సమస్యల గురించి ఈ కార్యక్రమంలో చర్చిస్తాం. ప్రజల నుంచి వారి సమస్యలు తెలుసుకుని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం. వాటి పరిష్కారానికి కృషి చేస్తాం."

- మల్లు రవి, పీసీసీ సీనియర్ ఉపాధ్యక్షుడు

Mallu Ravi Press Meet : ఈనెల 13 నాగర్‌కర్నూల్‌ జిల్లా కొల్లాపూర్‌ నియోజకవర్గంలో మన ఊరు-మన పోరు బహిరంగ సభ నిర్వహిస్తామని మల్లురవి తెలిపారు. గ్రామాల్లో సమస్యలు, దళితులకు మూడు ఎకరాల భూమి హామీ విస్మరణ, పేదలకు ఇళ్లు, నిరుద్యోగ భృతి తదితర అంశాలను ఎండగడతామని అన్నారు.

5 రాష్ట్రాల ఫలితాలతో టీ-కాంగ్రెస్‌కు సంబంధం లేదు

ABOUT THE AUTHOR

...view details