తెలంగాణ

telangana

ETV Bharat / city

'డ్రగ్స్‌ కేసులో ఎన్సీబీ అధ్వర్యంలో సిట్‌ ఏర్పాటు చేయాలి..' - Drugs Mafia in telangana

Mahesh Kumar Goud Comments on KTR: కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌ మహేష్‌కుమార్ గౌడ్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. మంత్రి కేటీఆర్​పై పలు ఆసక్తికర ఆరోపణలు చేశారు. డ్రగ్స్‌ మాఫియా మొత్తం కేటీఆర్‌ అండతోనే చెలరేగుతోందని ఆరోపించారు. మంత్రి కేటీఆర్​ డ్రగ్స్​ తీసుకుంటారని ప్రజల్లో అనుమానం ఉందని సంచలన వ్యాఖ్యలు చేశారు.

Congress Leader Mahesh Kumar Goud Comments on Minister KTR
Congress Leader Mahesh Kumar Goud Comments on Minister KTR

By

Published : Apr 3, 2022, 5:26 PM IST

Mahesh Kumar Goud Comments on KTR: రాష్ట్రంలో శాంతిభద్రతలు అదుపు తప్పాయని కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌ మహేష్‌కుమార్ గౌడ్‌ ధ్వజమెత్తారు. మంత్రి కేటీఆర్‌ కనుసన్నల్లోనే పబ్‌లు నడుస్తున్నాయని ఆరోపించారు. డ్రగ్స్‌ మాఫియా మొత్తం కేటీఆర్‌ అండతోనే చెలరేగుతోందని కీలక వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్​లో విచ్చలవిడితనం పెరిగిపోయి.. గంజాయి, డ్రగ్స్‌ యథేచ్ఛగా అమ్ముతున్నారని విమర్శించారు. మంత్రి కేటీఆర్‌ పదేపదే గోవా ఎందుకు వెళ్తున్నారని ప్రశ్నించారు. మంత్రి కేటీఆర్ డ్రగ్స్‌ తీసుకుంటారని ప్రజల్లో చాలా అనుమానాలున్నాయని మహేష్‌కుమార్ గౌడ్‌ తెలిపారు. డ్రగ్స్‌ అలవాటు లేకపోతే కేటీఆర్ శాంపిల్‌ ఇవ్వాలని డిమాండ్ చేశారు. డ్రగ్స్‌ విషయంలో తెరాసకు చిత్తశుద్ధి ఉంటే ఎన్సీబీ అధ్వర్యంలో సిట్‌ ఏర్పాటు చేయాలన్నారు. డ్రగ్స్‌ విషయంలో నిజాయితీగా విచారించి.. ఎవరున్నా చర్యలు తీసుకోవాలని సీపీ సీవీ ఆనంద్​ను డిమాండ్​ చేశారు.

"దేశంలోనే అత్యధిక మద్యం అమ్మే రాష్ట్రంగా మార్చిన ఘనత సీఎం కేసీఆర్​. గంజాయి రాష్ట్రంగా, డ్రగ్స్​ రాష్ట్రంగా తెలంగాణ మారిపోతోంది. ఈ డ్రగ్స్​ మాఫియా రాష్ట్రంలో కేటీఆర్ ప్రమేయం వల్లే విచ్చలవిడిగా పేట్రేగిపోతోంది. కేటీఆర్​ పదేపదే గోవా ఎందుకు పోతున్నారు..? తెరాస ఎమ్మెల్యేలు తరచూ గోవా పర్యటనలు ఎందుకు చేస్తున్నారు..? గతంలో రేవంత్​రెడ్డి వేసిన సవాల్​కు నిజాయితీగా శాంపిల్​ ఇవ్వాల్సిన కేటీఆర్​.. కోర్టును ఎందుకు ఆశ్రయించారు..? దీనిపై చర్చే వద్దని స్టే తెచ్చుకోవటాన్ని చూస్తుంటే.. కేటీఆర్​ పాత్ర ఉందని ఆర్థమవుతోంది. సాక్షాత్తు మంత్రే డ్రగ్స్​ తీసుకుంటారని ప్రజల్లో అనుమానం ఉంటే.. ఈ రాష్ట్రం ఎలా ముందుకు పోతుంది." -మహేష్‌కుమార్ గౌడ్‌, కాంగ్రెస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్

'డ్రగ్స్‌ కేసులో ఎన్సీబీ అధ్వర్యంలో సిట్‌ ఏర్పాటు చేయాలి..'

ఇదీ చూడండి:

ABOUT THE AUTHOR

...view details